Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - క్రైం

క్రైంనిజామాబాద్

Insurance Murder | ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రియుడితో కలిసి భర్త హత్య

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను భార్య హత్య చేయించింది. ఈ ఘటన సదాశివనగర్​ మండలంలో చోటు చేసుకుంది.

Shashi kiran Mottala
Last updated: June 10, 2026, 8:55 pm 8:55 pm
Shashi kiran Mottala
Share
Insurance Murder |

అక్షరటుడే, కామారెడ్డి: Insurance Murder | వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో, ఇన్సూరెన్స్(Insurance) డబ్బుల కోసం భర్తను భార్య హత్య చేయించింది. కేసును ఛేదించిన పోలీసులు  భార్య, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు ఎల్లారెడ్డి (Yelalreddy) డీఎస్పీ శ్రీనివాస్ రావు బుధవారం రాత్రి వివరాలు వెల్లడించారు.

Insurance Murder | సదాశివనగర్​ మండలంలో..

సదాశివనగర్ (Sadashivanagar) మండలం మర్కల్ గ్రామానికి చెందిన కంచర్ల రాజయ్య (45) గత నెల 22న మృతి చెందాడు. ఆయన భార్య కంచర్ల రేణుక తన భర్త రాత్రి వ్యవసాయ క్షేత్రానికి వెళ్తుండగా గుర్తు తెలియని జంతువు అడ్డురావడంతో బైక్ అదుపు తప్పి మృతి చెందాడని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎల్లారెడ్డి (Yellareddy Police) డీఎస్పీ శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో సీఐ సంతోష్ కుమార్ నేతృత్వంలోని బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. సాక్షుల వాంగ్మూలాలు, సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, పోస్టుమార్టం నివేదికను క్షుణ్ణంగా పరిశీలించగా ఇది ప్రమాదం కాదని, తలపై బలంగా కొట్టడం వల్ల జరిగిన పక్కా ప్రణాళికాబద్ధమైన హత్యగా తేలింది. దర్యాప్తులో మర్కల్ గ్రామానికి చెందిన కంచర్ల గంగశేఖర్ (37) ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.

Insurance Murder | వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

మృతుడి భార్య రేణుకతో గంగశేఖర్‌కు గత నాలుగేళ్లుగా అక్రమ సంబంధం ఉంది. భర్త రాజయ్య అడ్డుగా ఉన్నాడని, అతను చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులను పొందవచ్చనే దురాశతో ఇద్దరూ కలిసి హత్యకు కుట్ర పన్నారు. ఈ కుట్రలో భాగంగా గత నెల 21న గంగశేఖర్ రాజయ్యను గాంధారి ప్రాంతానికి పిలిపించి మద్యం తాగించాడు. అనంతరం తిర్మన్‌పల్లి గ్రామ శివారులో మత్తులో ఉన్న రాజయ్య తలపై ఐరన్ రాడ్‌తో బలంగా కొట్టి హత్య చేశాడు. ఘటనను రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించేందుకు మృతదేహం, మోటార్ సైకిల్‌ను అక్కడే ఉంచి పరారయ్యాడు.

పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. హత్యకు ఉపయోగించిన ఐరన్ రాడ్, మృతుడి మోటార్ సైకిల్, నిందితుల మొబైల్ ఫోన్లు, ఇతర సాంకేతిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కంచర్ల గంగశేఖర్, కంచర్ల రేణుకలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రమాదంగా కనిపించిన ఈ కేసును సూక్ష్మంగా దర్యాప్తు చేసిన సీఐ సంతోష్ కుమార్, ఎస్సై పుష్ప రాజు, ఎస్సై సిద్ధిక్, సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.

ఇది కూడా చదవండి : HYDRAA Land Protection | రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

TAGGED:crime news TelanganaHusband KillingIllegal RelationshipInsurance MurderKamareddy crimeMurder Casepolice investigationwife arrestedYelalreddyYellareddy Police
Previous Article HYDRAA Land Protection HYDRAA Land Protection | రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
Next Article Modi Governance Modi Governance | అధికారాన్ని సేవగా భావిస్తా : ప్రధాని మోదీ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Kalabhairava Temple Development |
నిజామాబాద్

Kalabhairava Temple Development | కాలభైరవ స్వామి ఆలయ అభివృద్ధిపై ఎమ్మెల్యే మదన్​మోహన్​ ప్రత్యేక దృష్టి..

By Shashi kiran Mottala
Paidi Rakesh Reddy POCSO
నిజామాబాద్తెలంగాణ

Paidi Rakesh Reddy POCSO | పొక్సో కేసు వ్యక్తిగత వ్యవహారం.. బీజేపీకి సంబంధం లేదు: ఎమ్మెల్యే పైడి రాకేష్ సంచలన వ్యాఖ్యలు

By Naresh Chandan
Police Transfers |
నిజామాబాద్

Police Transfers | పారదర్శక బదిలీలు సిబ్బందిలో విశ్వాసాన్ని పెంచుతాయి: ఎస్పీ రాజేష్ చంద్ర

By Shashi kiran Mottala
Vemula Prashanth Reddy
నిజామాబాద్

Vemula Prashanth Reddy | తెలంగాణ అస్తిత్వంపై కుట్రలు : వేముల ప్రశాంత్​రెడ్డి

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.