Police Obstruction Jail | పోలీసుల విధులకు ఆటంకం.. నిందితుడికి రెండేళ్ల జైలు

కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు, వాంగ్మూలాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడు గౌతంరెడ్డి దోషిగా తేల్చుతూ రెండేళ్ల జైలు శిక్ష విధించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Police Obstruction Jail | విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేసి వారి విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ మేరకు న్యాయమూర్తి ప్రసాద్ దుర్గా ప్రసాద్ బుధవారం తీర్పును ప్రకటించారు.

Police Obstruction Jail | పోలీసులపై దాడి ఆరోపణలు..

వివరాల్లోకి వెళితే.. 2025 మే 25న నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గాయత్రి నగర్‌కు చెందిన గౌతంరెడ్డిని మద్యం సేవించి వాహనం నడిపాడో లేదో నిర్ధారించేందుకు పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నించారు.

అయితే గౌతంరెడ్డి పోలీసుల విధులకు సహకరించకుండా వారిపై ఎదురు తిరిగినట్లు కేసు నమోదు అయింది. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీస్ సుమన్‌పై దాడి చేసి ఆయన గొంతు పిసికి గాయపర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే మరో పోలీసు అధికారి కంటిపై దాడి చేయడంతో ఆయన కూడా గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Police Obstruction Jail | మూడో ఠాణాలో కేసు నమోదు..

ఈ ఘటనపై మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి గౌతంరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం కేసును కోర్టులో ప్రవేశపెట్టగా, ప్రభుత్వ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీరజ వాదనలు వినిపించారు.

కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు, వాంగ్మూలాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడు గౌతంరెడ్డి దోషిగా తేల్చుతూ రెండేళ్ల జైలు శిక్ష విధించారు.

పోలీసులపై దాడులు, విధి నిర్వహణకు ఆటంకం కలిగించే చర్యలను చట్టం తీవ్రంగా పరిగణిస్తుందని, అలాంటి ఘటనల్లో కఠిన చర్యలు తప్పవని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.

Kerala fake study certificates | “డిగ్రీల దుకాణం”: చదివినవాడు నిరుద్యోగి… ముద్రించేవాడు నిపుణుడు!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *