KTR Congress Allegations | మీనాక్షి నటరాజన్ ఓటమి వెనుక కాంగ్రెస్ కుట్ర: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుట్రలే కారణమని కేటీఆర్ ( KTR ) ఆరోపించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: KTR Congress Allegations | మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుట్రలే కారణమని కేటీఆర్ ( KTR ) ఆరోపించారు. ఆమె ఓటమికి పార్టీలోని వారే బాధ్యులని, తనకు ద్రోహం చేసింది ఎవరో ఆమె స్వయంగా తెలుసుకోవాలని సూచించారు. మీనాక్షి నటరాజన్‌పై ఉన్న కేసుల వివరాలను బీజేపీ నేతలకు లీక్ చేసింది ఎవరో కాంగ్రెస్ అధిష్టానం విచారించుకోవాలని సవాల్ విసిరారు.

KTR Congress Allegations | రేవంత్ రెడ్డిపై సెటైర్లు..

నోరు తెరిస్తే ప్రతి విషయానికి ‘సిట్’ (SIT) వేస్తామనే ముఖ్యమంత్రి, పార్టీలోని ‘బ్లాక్ షీప్’ (ద్రోహులు) ఎవరో తేల్చడానికి ఎందుకు విచారణ జరిపించరని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను ప్రతిపక్షాలకు ఆపాదించడం సరికాదని, ఆ పార్టీ అంటేనే అవినీతి కంపు అని ఘాటుగా విమర్శించారు.

KTR Congress Allegations | “రెన్యూవల్ సీఎం” అంటూ వ్యాఖ్యలు..

కాంగ్రెస్ పార్టీలో పదవులన్నీ డబ్బులకే వస్తున్నాయని ఇటీవల షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ సమర్థించారు. గతంలో పీసీసీ పదవిని, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని డబ్బులకు అమ్ముకున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ‘రెగ్యులర్’ సీఎం కాదని, ప్రతి నెలా అధిష్టానానికి డబ్బుల మూటలు పంపితేనే పదవిలో కొనసాగే ‘రెన్యూవల్ సీఎం’ అని ఆయన ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: Canada Visa Scam | నకిలీ కాల్స్‌తో మోసాలు.. కెనడాలోని భారతీయులకు కీలక అడ్వైజరీ

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *