అక్షరటుడే, ఇందూరు: Midday Meals | జిల్లాలోని పాఠశాలల్లో మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని(school meal program) తయారు చేయాలని కోర్సు డైరెక్టర్ శంకర్ పేర్కొన్నారు. నగరంలోని(Nizamabad) బోర్గాం(పి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలకు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు(Midday Meal Agency) జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Midday Meals | నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర పరిణామాలు
మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాల్సిన బాధ్యత మధ్యాహ్న భోజన ఏజెన్సీలపై ఉందని శంకర్ పేర్కొన్నారు. భోజనం తయారు చేయడంలో ఏమాత్రం అశ్రద్ధ వహించినా తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తూ ఏరోజుకారోజు నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించేలా కృషి చేయాలని ఆయన కోరారు.
అనంతరం ఇన్ఛార్జి డీఈవో బాలాజీ మాట్లాడుతూ హెచ్ఎంలు, ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రిసోర్స్ పర్సన్ మురళి, రాంప్రసాద్ మధ్యాహ్న భోజనం తయారు చేయడంలో మేలుకువలను తెలియజేశారు. మధ్యాహ్న భోజనాన్ని వండి చూపించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు నరేష్, మధుసూదన్, లింగన్న, సుఖేష్, ఆయా మండలాల ఎంఈవోలు ఏజెన్సీల నిర్వాహకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : El Nino Impact | ఎల్‌నినో ఎఫెక్ట్.. దేశంలోని 197 జిల్లాలకు కేంద్రం బిగ్ అలర్ట్
