KTR Allegations | మీనాక్షి నటరాజన్​పై సీఎం కుట్ర.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

సొంత పార్టీ వాళ్లనే సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని కేటీఆర్​ ఆరోపించారు. మీనాక్షి నటరాజన్​ రాజ్యసభకు వెళ్లకుండా కుట్ర చేశారన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR Allegations | సొంత పార్టీ వాళ్లనే సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని బీఆర్​ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఆరోపించారు. ఖైరతాబాద్​ నియోజకవర్గ బీఆర్​ఎస్​ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రేవంత్ రెడ్డి అవినీతిపై మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీకి రిపోర్ట్ ఇచ్చారని కేటీఆర్​ అన్నారు. అందుకే మీనాక్షిపై పగపట్టి, దొంగ కేసు పెట్టించారని ఆరోపించారు. మీనాక్షి మధ్యప్రదేశ్‌లో నామినేషన్ వేస్తే, బీజేపీ వాళ్లకు కేసు విషయం చెప్పారన్నారు. మీనాక్షి నటరాజన్‌ను రాజ్యసభకు వెళ్లకుండా చేశారని ఆరోపించారు.

KTR Allegations | అట్టర్​ ప్లాఫ్​

కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ సినిమా అని కేటీఆర్​ అన్నారు. సినిమా ట్రైలర్ చూడగానే హిట్ లేదా ఫ్లాప్ అని తెలిసినట్లే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్వెల్‌కే ఫ్లాప్ అని తేలిపోయిందని, ఈ రెండున్నర ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్​కు మిగిలిండ్ ఏండ్ కార్డే అన్నారు. అడ్డగోలుగా హమీలిచ్చిన అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. అందరినీ మోసం చేస్తోందన్నారు.

KTR Allegations | పగబట్టిన సీఎం

కాంగ్రెస్‌లో ఉన్న కొంత మంది వ్యక్తుల్లో మీనాక్షి నటరాజన్ నిజాయితీగల మనిషి అన్నారు. రాహుల్ గాంధీకి నమ్మిన బంటు అయిన ఆమెపై రేవంత్​రెడ్డి కుట్ర చేశారని ఆరోపించారు. ప్రజలకే కాకుండా సొంత పార్టీ వాళ్లకి గుండు కొట్టి, శఠగోపం పెట్టిన దొంగ రేవంత్ రెడ్డి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి భూములు, కాంట్రాక్టులు అమ్ముకుంటున్నాడని, అడ్డగోలు అవినీతి చేస్తున్నాడని మీనాక్షి నటరాజన్​ రాహుల్ గాంధీకి చెప్పడంతో ఆమెపై పగపట్టారన్నారు.

KTR Allegations | నిరుద్యోగ భృతి ఎక్కడ

మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని కేటీఆర్​ ప్రశ్నించారు. ఇప్పటివరకు 4 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.4 వేల భృతి ఏమైందని కేటీఆర్​ ప్రశ్నించారు. హైదరాబాద్​ నగరంలో ఒక్క ఇల్లు కూడా కట్టని కాంగ్రెస్​ హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిని కూడా చదవండి : Software Engineer Death | యాదాద్రి జిల్లాలో విషాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *