Kishan Reddy Challenge | నన్ను అడ్డుకునే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా?: కిషన్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kishan Reddy Challenge | తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ( Kishan Reddy ) తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు.

Kishan Reddy Challenge | మెట్రో నిధులపై సవాల్..

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను కిషన్ రెడ్డి ఖండించారు. మెట్రోకు కేంద్రం నిధులు కేటాయించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, లేదంటే హామీలను అమలు చేయని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ తమ పదవులకు రాజీనామా చేస్తారా? అని ఆయన సవాల్ విసిరారు.

Kishan Reddy Challenge | “నన్ను తరిమికొట్టే వ్యక్తి ఇంకా పుట్టలేదు”..

తమను తెలంగాణ నుంచి తరిమికొడతానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్న వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించారు. “నన్ను అడ్డుకునే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా? నన్ను తరిమికొట్టే వ్యక్తి ఇంకా ఈ గడ్డ మీద పుట్టలేదు. నేను బీజేపీ కార్యకర్తను” అని ఆయన ఘాటుగా హెచ్చరించారు.

Kishan Reddy Challenge | కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే..

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెరవెనుక రహస్య ఒప్పందాలు చేసుకుని రాజకీయాలు చేస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కనపెట్టి, ఇతర పార్టీలపై విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు.

ఇది కూడా చదవండి: House Fire Nizamabad | కార్పొరేటర్​ ఇంట్లో షార్ట్​ సర్క్యూట్​.. తప్పిన ముప్పు..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *