Shabbir Audio | వైరల్ అయిన ఆడియో క్లిప్ నకిలీది..: క్రమశిక్షణ కమిటీకి షబ్బీర్ అలీ వివరణ

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ క్రమశిక్షణ కమిటీ ఎదుట ఆదివారం హాజరయ్యారు. ఇటీవల వైరల్​గా మారిన ఆడియో క్లిప్​లపై వివరణ ఇచ్చారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Audio | ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ (Shabbir Ali) క్రమశిక్షణ కమిటీ ఎదుట ఆదివారం హాజరయ్యారు. ఇటీవల వైరల్​గా మారిన ఆడియో క్లిప్​లపై వివరణ ఇచ్చారు.

Shabbir Audio | ఇటీవల షోకాజ్​ నోటీసులు..

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆడియో క్లిప్ వ్యవహారంపై ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ శనివారం వివరణ ఇవ్వాలని షబ్బీర్ అలీకి క్రమశిక్షణ కమిటీ లేఖ రాసిన విషయం తెలిసిందే. టీపీసీసీ(TPCC) చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Bomma mahesh kumar Goud) డబ్బులు తీసుకొని పదవులు అమ్ముకుంటున్నారని, మహిళలను కించపరిచేలా షబ్బీర్ అలీ మాట్లాడినట్లు ఓ ఆడియో లీక్ కావడంపై వివరణ ఇవ్వాలని కమిటీ ఆదేశించింది. దీనిపై స్పందించిన షబ్బీర్ అలీ ఆ ఆడియో క్లిప్ పూర్తిగా నకిలీదని, కల్పితమైనదని కొట్టిపారేశారు.

అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలకు న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్రమశిక్షణ కమిటీ వివరణ కోరకముందే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు, కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

kamareddy 1

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *