అక్షరటుడే వెబ్‌డెస్క్: Indian Sailors Attack |గల్ఫ్ దేశాల సమీపంలో వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో తప్పుబట్టింది.
Indian Sailors Attack | ప్రధాని మౌనం సిగ్గుచేటు..
ఈ దారుణ ఘటనపై ప్రధాని మోదీ స్పందించకపోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi ) వాద్రా ధ్వజమెత్తారు. మన దేశ సార్వభౌమత్వాన్ని, పౌరుల ప్రాణాలను రక్షించడంలో కేంద్రం విఫలమైందని ఆమె విమర్శించారు. క్షమాపణ చెప్పాల్సింది పోయి, అమెరికా మన దేశానికి ఆదేశాలు జారీ చేస్తూ బెదిరింపులకు దిగుతోందని, దీనిని భారత్ గట్టిగా అడ్డుకోవాలని ఆమె ఎక్స్ (ట్విట్టర్) వేదికగా డిమాండ్ చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, మనీష్ తివారీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Indian Sailors Attack | పవన్ ఖేరా..
అంతర్జాతీయ చట్టాల (జెనీవా ఒప్పందం & శాన్ రెమో మాన్యువల్) ప్రకారం, యుద్ధ సమయంలో మూడవ దేశానికి చెందిన వాణిజ్య నౌకలపై దాడి చేయడం నేరమని ఆయన గుర్తు చేశారు. విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందన చాలా బలహీనంగా ఉందని, అమెరికాను క్షమాపణలు కోరడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
Indian Sailors Attack | మనీష్ తివారీ..
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, మంత్రి జైశంకర్ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణపై తివారీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రూబియో వ్యాఖ్యల్లో కనీస సానుభూతి లేదని, పైగా భారత నావికులనే బాధ్యులను చేసేలా ఆయన మాట్లాడటం దారుణమని పేర్కొన్నారు. ఆ సంభాషణకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Indian Sailors Attack |అమెరికా ఘాటు స్పందన..
హోర్ముజ్ జలసంధిలో అమెరికా విధించిన ఆంక్షలను ఏ నౌక ఉల్లంఘించినా సహించేది లేదని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తమ ఆదేశాలను నౌకలు పాటించాల్సిందేనని నొక్కి చెప్పింది. అయితే, ఈ దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. నౌకలపై దాడులు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికాకు ఇప్పటికే తన నిరసనను తెలియజేశారు. మొత్తంగా, ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరమైన చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వ వైఖరిపై విపక్షాల దాడి మరింత ఉధృతమవుతోంది.
ఇది కూడా చదవండి: Oman Indian Vessel | ఒమన్ తీరంలో చిక్కుకున్న భారత నౌక.. 14 మంది సిబ్బంది క్షేమం