అక్షరటుడే, డిచ్పల్లి: Road Accident | రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 44వ జాతీయ రహదారిపై డిచ్పల్లి (Dichpally) వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
Road Accident | నిజామాబాద్ బోర్గాంనకు చెందిన..
డిచ్పల్లి ఎస్సై ఆరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌లోని(Nizamabad) బోర్గాంనకు చెందిన మెట్టు రామ్ ధనుష్, కచ్చకాయల తేజ బైక్‌పై సుద్దపల్లికి వచ్చారు. తిరిగి ఆదివారం తెల్లవారుజామున నిజామాబాద్ వైపు వెళ్తుండగా జాతీయ రహదారిపై (NH44 accident) నాగ్‌పూర్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మెట్టు రామ్ ధనుష్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు తేజ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం తేజ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: FIFA Stadium Alcohol | ‘మందు’బాబు క్రేజీ ఐడియా.. స్టేడియంలోకి ఫోన్ కవర్లో మద్యం తెచ్చిన అభిమాని