Vahan Sarathi Down | నిలిచిన వాహన సారథి సేవలు..

తెలంగాణ వ్యాప్తంగా వాహన సారథి సాఫ్ట్‌వేర్ నిలిచిపోయింది. దీంతో రవాణా శాఖ కార్యాలయాల్లో సేవలు ఆగిపోయాయి.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vahan Sarathi Down | తెలంగాణ (Telangana) వ్యాప్తంగా వాహన సారథి సాఫ్ట్‌వేర్ నిలిచిపోయింది. దీంతో రవాణా శాఖ కార్యాలయాల్లో సేవలు ఆగిపోయాయి.

ప్రస్తుతం ఆర్టీఏ కార్యాలయాల్లో వాహన సారథి పోర్టల్​ ద్వారా సేవలు అందిస్తున్నారు. డ్రైవింగ్​ లైసెన్స్​, వాహనాల రిజిస్ట్రేషన్​, ఇతర సేవల కోసం ప్రభుత్వం దీనిని అందుబాటులోకి తెచ్చింది. అయితే సోమవారం ఉదయం నుంచి పోర్టల్​ (Vahana Sarathi Portal) సరిగా పని చేయడం లేదు.

Vahan Sarathi Down | వాహనదారుల ఇబ్బందులు

Vahan Sarathi Down

ఆర్టీఏ కార్యాలయాల్లో వాహనాల రిజిస్ట్రేషన్​, లైర్నింగ్, పర్మినెంట్​ లైసెన్స్​ల కోసం స్లాట్ బుక్​ చేసుకున్న ప్రజలు ఉదయాన్నే కార్యాలయాలకు వచ్చారు. అయితే సర్వర్​ సమస్యతో గంటల తరబడి వారు క్యూలైన్​లో నిరీకిస్తున్నారు. పోర్టల్​ పునరుద్దరణకు గంట సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి..:  K Namrata Missing | నా సోదరి కనిపించడం లేదు.. పోలీసులకు మహిళా కమిషన్​ ఛైర్​పర్సన్​ ఫిర్యాదు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *