Student Leaders Arrest | కలెక్టరేట్​లో విద్యార్థి సంఘాల నాయకుల అరెస్ట్​

అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్​ వద్ద ధర్నా చేశారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు:  Student Leaders Arrest | జిల్లాలో అనుమతి లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్​ చేశాయి. ఈ మేరకే సోమవారం కలెక్టరేట్​ (Collectorate)ను ముట్టడించాయి. కలెక్టరేట్​ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేశారు.

Student Leaders Arrest | అనుమతి లేని పాఠశాలలపై పట్టింపేది..?

Student Leaders Arrest

జిల్లావ్యాప్తంగా అనుమతి లేని పాఠశాలలు ఉన్నాయని విద్యాశాఖకు సమాచారం అందించినప్పటికీ పట్టించుకోవడంలేదని సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలల్లో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా విద్యాశాఖలో స్పందన లేదన్నారు. చట్టప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో క్యాపిటల్ ఫీజులు తీసుకోవద్దని.. అధిక ఫీజులు వసూలు చేయవద్దని ఉన్నప్పటికీ నిబంధనలో పాటించట్లేదన్నారు. వెంటనే ప్రైవేట్​ యాజమాన్యాలను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్​లోకి చొచ్చుకెళ్లేందుకు సంఘాల నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ ఆందోళనలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్​యూ, ఏఐపీఎస్​యూ, డీఎస్ఎఫ్ఐ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: School Reopening | ఉమ్మడి జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభం..

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *