అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tamil Nadu Incident | తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తిరువళ్లూర్ (Thiruvallur) సమీపంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ బాలికకు బిస్కెట్లు ఇస్తానని నిందితుడు పొదల్లోకి తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడి చేశాడు.
చిన్నారి పొద దగ్గర తీవ్ర గాయాలతో కనిపించడంతో అక్కడే ఉండే స్థానికులు నిందితుడి పట్టుకోని, చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. లైంగిక దాడికి గురైన మూడేళ్ల చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై పెరుగుతున్న నేరాలపై ఈ ఘటన తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
Tamil Nadu Incident | నిందితుడి అరెస్ట్
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన బీహార్‌కు చెందిన ఒక వలస కార్మికుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబం కూడా బీహార్‌కు చెందినదేనని, వారు గుమ్మిడిపూండిలోని సిప్‌కాట్ (SIPCOT) పారిశ్రామిక ప్రాంతంలో నివసిస్తున్నారని సమాచారం. నిన్న పొదలతో కూడిన ఒక ప్రాంతంలో తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆ చిన్నారిని స్థానికులు గుర్తించారు. ఆమెను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ రోజు మరణించింది.
Tamil Nadu Incident | ముందే పరిచియం

నిందితుడు ఆ చిన్నారి కుటుంబానికి ముందే తెలుసని పోలీసులు తెలిపారు. చాక్లెట్ ఆశ చూపి ఆమెను తీసుకెళ్లాడని పేర్కొన్నారు. అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పారు. నిందితుడిని పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేశారు. ఇందులో ఇతరుల పాత్ర ఉందనే అనుమానంతో వారిపై సైతం దాడి చేశారు. అయితే ఈ దారుణమైన నేరంలో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రమేయం ఉందన్న వాదనలను పోలీసులు తోసిపుచ్చారు.
Tamil Nadu Incident | డీఎంకే విమర్శలు
ఈ ఘటనపై డీఎంకే పార్టీ విజయ్ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. నేరస్తులకు కఠిన శిక్షలు విధించాలని, ప్రభుత్వం మరింత బలంగా జోక్యం చేసుకోవాలని డీఎంకే నేత టీకేఎస్ ఎలాంగోవన్ డిమాండ్ చేశారు. ఇది ఒక సామాజిక సమస్య. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని కోరారు. ఇటీవల నమోదైన అనేక కేసులలో అధికార పార్టీకి చెందిన సభ్యులు, కార్యకర్తల ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు.
ఇది కూడా చదవండి..: Farmers Special Flight | భూములిచ్చిన రైతులకు ప్రత్యేక విమాన ప్రయాణం