అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raids | రాష్ట్రంలో రోజు రోజుకు అవినీతి పెరిగి పోతుంది. కిందిస్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు లంచాలు తీసుకుంటున్నారు. ఇటీవల కీలక స్థానాల్లో ఉన్న అధికారుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేపట్టగా.. రూ.వందల కోట్ల విలువైన అక్రమాస్తులు వెలుగు చూశాయి. తాజాగా సర్వే అండ్ ల్యాండ్స్ డిప్యూటీ డైరెక్టర్ నివాసాల్లో సైతం భారీగా అక్రమాస్తులను అధికారులు గుర్తించారు.
హైదరాబాద్ (మల్టీ జోన్-II) సర్వే & ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఆయన అవినీతి పద్ధతులు, అనుమానాస్పద మార్గాల ద్వారా భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని వెల్లడించారు. దీంతో ఆయనతో పాటు అతని బంధువులు, బినామీలు, ఇతర సహచరులకు చెందిన మరో 9 ప్రదేశాలలో సోదాలు నిర్వహించారు.
ACB Raids | ఆస్తుల వివరాలు
తనిఖీల్లో నరహరికి రంగారెడ్డి జిల్లాలోని ఐదు ఖాళీ స్థలాలు, మహేశ్వరంలోని 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, పుప్పాలగూడలోని ఒక బహుళ అంతస్తుల భవనంలో 2,500 చదరపు అడుగుల విస్తీర్ణం గల ప్లాట్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నర్సింగిలో ఒక బహుళ అంతస్తుల భవనంలో ఒక్కొక్కటి 1,860 చదరపు అడుగుల విస్తీర్ణం గల రెండు ప్లాట్లు, రాజేంద్ర నగర్‌లోని ఒక బహుళ అంతస్తుల భవనంలో 1,377 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఒక ప్లాట్‌కు సంబంధించిన పత్రాలు లభించాయి. గచ్చిబౌలిలోని టీఎన్జీఓస్ కాలనీలో ఉన్న ఒక జీ+3 భవనం, చత్రినాకలో ఒక జీ+2 నివాస భవనం ఉంది.
ACB Raids | 1.3 కిలోల బంగారం
నిందితుడు నరహరి ఇంట్లో రూ. 1.54 కోట్ల నగదు, రూ. 2.29 కోట్ల బ్యాంకు నిల్వలు, రూ. 5.04 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, దాదాపు 1.3 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ డైరెక్టర్ నరహరి భార్య పేరు మీద ఉన్న రెండు లాకర్లను కూడా గుర్తించారు, దర్యాప్తు క్రమంలో వాటిని తెరవనున్నారు. ఒక కియా కేరెన్స్ స్మార్ట్‌స్ట్రీమ్ జి1.5 6ఎంటి (పి) కారు కూడా లభించింది. సోదాల సమయంలో గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ రూ. 13 కోట్లుగా అధికారులు తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.వంద కోట్లకు పైగా ఉంటుందని పేర్కొన్నారు.
DA CASE – ACB CITY RANGE II
Against Sri Sunkari Narahari Rao, Deputy Director, Multi Zone-II, Survey & Land Records, Telangana, Hyderabad(Full details in press note) pic.twitter.com/1B8X0hM5bR
— ACB Telangana (@TelanganaACB) June 16, 2026
ఇది కూడా చదవండి : Gurukul Tender Scam | గురుకుల టెండర్లలో స్కామ్ : హరీశ్‌రావు