అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Division Problems Resolution | నగరంలోని డివిజన్లలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మేయర్ ఉమారాణి (Mayor Umarani) అన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా బుధవారం నగరంలోని 10, 21, 59 డివిజన్లలో పర్యటించారు.
Division Problems Resolution | అంతర్గత రహదారులు.. డ్రెయినేజీలు..
ఆయా డివిజన్లలోని అంతర్గత రహదారులు..డ్రెయినేజీలు, తాగునీటి సరఫరా వ్యవస్థలు, పారిశుధ్య నిర్వహణ పనులను మేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలు ఆమె దృష్టికి తీసుకురాగా వాటిని అక్కడికక్కడే పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకంగా తాగునీటి సరఫరాలో అంతరాయాలు, డ్రెయినేజీ సమస్యల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, పారిశుధ్య నిర్వహణలో లోపాలు వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంలో ఎటువంటి నిర్లక్ష్యం సహించబోమని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి సమస్యను నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
Division Problems Resolution | అభివృద్ధి పనులను ఆరా..
అనంతరం ఆయా డివిజన్లలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన మేయర్ పనుల నాణ్యత, పురోగతిపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే తెలుస్తాయనే ఉద్దేశంతో తాము నిత్యం డివిజన్లలో పర్యటిస్తున్నామన్నారు. ఈ పర్యటనలో స్థానిక కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Yoga Day Awareness | యోగాతో ఆరోగ్యం పదిలం.. : ఎమ్మెల్యే ధన్పాల్