అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao Allegations | గురుకుల పాఠశాలల (Gurukul Schools) టెండర్లలో భారీ స్కామ్ జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించిన విషయం తెలిసిందే. ఆయనకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. కరీంనగర్ వారు బుధవారం మాట్లాడారు.
కరీంనగర్ (Karimnagar) జిల్లా రాజకీయాల్లో గతంలో వెంకట్ స్వామి, చొక్కారావు ఎలాంటి రాజకీయాలు చేశారో ఇప్పుడు తాను, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అలాంటి రాజకీయాలు చేస్తున్నామని పొన్నం ప్రభాకార్ అన్నారు. రాజకీయాల్లో ఆదర్శంగా ఉన్నామని చెప్పారు. సంక్షేమ శాఖల్లో మొత్తం సెంట్రల్ ప్రొక్యూర్ మెంట్ టెండర్లు 2000 కోట్లు కానప్పుడు 2 వేల కోట్ల స్కాం జరిగిందని ఎలా అంటారని ప్రశ్నించారు.
Harish Rao Allegations | దేనికైనా సిద్ధం
తాము పారదర్శకంగా ఉన్నామని పొన్నం తెలిపారు. అవినీతి చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు. అసత్య ఆరోపణలు చేస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదన్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు తొలగించాలని ఎస్ఐఆర్ తీసుకొచ్చారని విమర్శించారు. తమపై ఎవరు వేలు ఎత్తి చూపెట్టే అవకాశం ఇవ్వమన్నారు. బీజేపీ (BJP) అనుకూలంగా ఎన్నికల సంఘం పని చేస్తోందని ఆరోపించారు. అర్హుల ఓట్లను తొలగించకుండా ఎస్ఐఆర్ చేపడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఏమీ లేదన్నారు. రూ .2 వేల కోట్ల స్కామ్ అంటూ అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Harish Rao Allegations | బస్సులో ప్రయాణించిన మంత్రులు
వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కరీంనగర్ ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆర్టీసీ బస్సులో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ప్రయాణించారు. ప్రయాణికులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తున్నామని కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిందని ఎన్నికలు పూర్తికాగానే గెలిచిన సంఘము నాయకులతో అధికారుల కమిటీలో విలీనం ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Rythu Bharosa Funds | అన్నదాతలకు గుడ్‌న్యూస్.. త్వరలో రైతు భరోసా