Nifty Crosses 24000 | లాభాల్లో ముగిసిన సూచీలు.. 24 వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో సెషన్‌లోనూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 347 పాయింట్లు, నిఫ్టీ 96 పాయింట్లు పెరిగాయి.

Shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nifty Crosses 24000 | అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందంపై నెలకొన్న ఆశావాదంతోపాటు ముడిచమురు ధరలు తగ్గుతుండడంతో స్టాక్ మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. ఈ రోజు రాత్రి యూఎస్ ఫెడరల్ రిజర్వ్ యొక్క ద్రవ్య విధాన ఫలితం వెలువడనుంది. ఫెడ్ విధాన నిర్ణయానికి ముందు ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా స్పందించినా.. యూఎస్ బాండ్ ఈల్డ్స్ బలహీనపడుతుండడం, రూపాయి విలువ బలోపేతం అవుతుండడంతో భారత ఈక్విటీలు మాత్రం రాణించాయి.

Nifty Crosses 24000 | లాభాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 272 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా తొలుత అమ్మకాల ఒత్తిడితో 312 పాయింట్లు కోల్పోయింది. తర్వాత పుంజుకుని 451 పాయింట్లు పైకి ఎగబాకింది. నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో ప్రారంభమై 75 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి 139 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 347 పాయింట్ల లాభంతో 77,155 వద్ద, నిఫ్టీ 96 పాయింట్ల లాభంతో 24,085 వద్ద స్థిరపడ్డాయి.

Nifty Crosses 24000 | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,323 కంపెనీలు లాభపడగా 1,956 స్టాక్స్ నష్టపోయాయి. 164 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 133 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 56 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 19 స్టాక్ లాభపడగా.. 11 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ట్రెంట్ 7.06 శాతం, బీఈఎల్ 3.06 శాతం, ఎటర్నల్ 1.95 శాతం, టాటా స్టీల్ 1.53 శాతం, ఇన్ఫోసిస్ 1.29 శాతం లాభపడ్డాయి.

Top Losers : బజాజ్ ఫిన్‌సర్వ్ 1.22 శాతం, యాక్సిస్ 1.09 శాతం, కొటక్ బ్యాంక్ 0.88 శాతం, మారుతి 0.45 శాతం, ఆసియన్ పెయింట్ 0.43 నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: June 17 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *