Social Media Defamation | అసభ్యకర పోస్టులు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోండి..: గడ్డం ఇందుప్రియ

తనపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు ప్రచారం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి మున్సిపల్ మాజీ ఛైర్​పర్సన్​ గడ్డం ఇందుప్రియ కోరారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Social Media Defamation | తనపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు ప్రచారం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి మున్సిపల్ మాజీ ఛైర్​పర్సన్​ గడ్డం ఇందుప్రియ కోరారు. ఈ మేరకు హైదరాబాద్ (Hyderabad)​లో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ గద్వాల విజయలక్ష్మికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Social Media Defamation | ‘కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఫేస్‌బుక్’లో..

ఈనెల 12వ తేదీ తెల్లవారుజామున సుమారు రెండు గంటలకు ‘కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఫేస్‌బుక్’ పేజీలో షేక్ ముక్తార్ అనే వ్యక్తి తనను లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెడుతున్నారన్నారు. అసభ్యకరమైన, అవమానకరమైన, లైంగిక భావాలతో కూడిన పోస్టును అప్‌లోడ్ చేశాడని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆ పోస్టులో తన పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా తనను సామాజికంగా కించపర్చే ఉద్దేశంతో ప్రచారం జరుగుతోందని ఇందుప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో తనకున్న గౌరవం, రాజకీయ, సామాజిక రంగాల్లో ఎదుగుదలను సహించలేక మహమ్మద్ ఇషాక్ షేరు, అంజద్, పర్వేజ్ హైమద్, చాట్ల రాజేశ్వర్, గుడుగుల శ్రీనివాస్, ఇర్ఫాన్, కైఫ్, సుచితాన్ రెడ్డి, కొప్పుల మహేష్ రెడ్డి తదితరులు ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ పోస్టులు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉండడంతో పాటు మహిళలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని కమిషన్ ఛైర్​పర్సన్​ దృష్టికి తీసుకెళ్లారు.

ఇది కూడా చదవండి..: Urea App Cancellation | యూరియా యాప్​ను రద్దు చేయాల్సిందే..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *