అక్షరటుడే వెబ్‌డెస్క్: Etela Rajender Cantonment | కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ( Etela Rajender ), సీఈఓ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన సీఈఓ నెగెటివ్ మైండ్‌సెట్‌తో వ్యవహరిస్తున్నారని, ప్రజాప్రతినిధులు చెప్పే విషయాలకు సరైన స్పందన రావడం లేదని మండిపడ్డారు.
Etela Rajender Cantonment | డ్రైనేజీ వ్యవస్థ..
కంటోన్మెంట్ భూముల అమ్మకం ద్వారా వచ్చిన రూ. 303 కోట్లతో స్ట్రామ్ వాటర్ డ్రైన్లు, డ్రైనేజ్ సిస్టమ్‌ను రాబోయే 40 సంవత్సరాలకు సరిపడా శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ పనులను సమర్థులైన కాంట్రాక్టర్లకు ఇచ్చి, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. రాకేష్ మిట్టల్ నుంచి రూ. 20 కోట్లు, ప్రభుత్వం నుండి రావాల్సిన రూ. 25 కోట్ల స్టాంప్ డ్యూటీ నిధులను తెప్పించామని చెప్పారు. డబ్బులకు కొరత లేకపోయినా, పనులు చేయడంలో సీఈఓ సుముఖంగా లేరని ఈటల ఆరోపించారు.

Etela Rajender Cantonment | రాజుల పాలన కాదు..
“కంటోన్మెంట్ అంటే మేమే రాజులమనే భావన అధికారులకు మంచిది కాదు. ప్రజలకు సేవకులుగా ఉండాలి” అని ఆయన హితవు పలికారు. గతంలో ఎంతో మెరుగ్గా ఉన్న కంటోన్మెంట్ ఆసుపత్రిని, ప్రస్తుత అధికారుల నిర్లక్ష్యంతో నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తప్పుడు నివేదికలతో కూల్చిన షాపుల యజమానులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Etela Rajender Cantonment | భూ కబ్జాలపై తీవ్ర హెచ్చరిక..
సర్వే నంబర్ 57/1, 157/1 భూముల వివాదంపై స్పందిస్తూ.. ప్రభుత్వం కంచే చేను మేసినట్లు వ్యవహరిస్తోందని ఈటల ఆరోపించారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేలా డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారని, అధికారులు పైరవీకారులకు, కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. నాలుగు తరాలుగా ఉన్న భూములను ప్రైవేట్ పరం చేయడం వెనుక ఉన్న అక్రమాలపై సమగ్ర విచారణ (రివ్యూ) జరిపించాలని, అవినీతికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. పేదలకు అండగా ఉండి, వారి భూములు కాపాడే బాధ్యత తీసుకుంటానని ఎంపీ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Basara IIIT | బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..