Rythu Bima Scheme | ‘రైతు బీమా’ ఎగ్గొట్టడానికి కుట్ర : జీవన్​రెడ్డి

రైతు బీమా పథకాన్ని ఎగ్గొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్​ఎస్​ నాయకుడు, మాజీ మంత్రి జీవన్​రెడ్డి ఆరోపించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rythu Bima Scheme | రైతు బీమా పథకాన్ని ఎగ్గొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కుట్ర చేస్తుందని బీఆర్​ఎస్​ నాయకుడు, మాజీ మంత్రి జీవన్​రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోవడంతో 7600 మంది చనిపోయిన వారి కుటుంబాలకు రైతు బీమా డబ్బులు రాలేదన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను కనుమరుగు చేయాలని చూస్తే ప్రజలు ఈ కాంగ్రెస్ నాయకులను కనుమరుగు చేస్తారని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం రైతుబీమా పథకం ఉందా లేదా అనే విషయం అర్థం కావడం లేదన్నారు.

Rythu Bima Scheme | రైతులు నష్టపోతారు

ప్రభుత్వం బోనస్ ఇస్తామంటున్న 7 రకాల వడ్ల వల్ల రైతులు ఎకరానికి 10 క్వింటాళ్లు నష్టపోతారని జీవన్​రెడ్డి (Jeevan Reddy) పేర్కొన్నారు. అంటే ఒక్కో రైతుకు రూ. 24 వేల తక్కువ ఆదాయం వస్తుందన్నారు. 33 రకాల వడ్లలో ప్రభుత్వం గుర్తిస్తున్న 7 రకాల వడ్లు ఎకరాకి 20 క్వింటాళ్లు పండితే మిగతా 26 రకాలు మాత్రం ఎకరాకు 30 క్వింటాళ్లు పండుతాయని ఆయన పేర్కొన్నారు.

Rythu Bima Scheme | యూరియా యాప్​ తొలగించాలి

Rythu Bima Scheme

యూరియా యాప్ నాకే అర్థం కాదు.. ఇక సాధారణ రైతులకు ఏం అర్థమవుతుంది అని జీవన్​రెడ్డి ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఈ యాప్ ఎందుకన్నారు. మార్కెట్​లో యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ఎరువులు తీసుకురావడంతో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

ఇది కూడా చదవండి..: Breakfast Scheme | బీఆర్​ఎస్​ హయాంలోనే బ్రేక్​ఫాస్ట్​ స్కీమ్​ ప్రారంభించాం : కేటీఆర్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *