Kinnerasani Jungle Safari | ‘కిన్నెరసాని’ అందాలు చూద్దామా.. జంగిల్ సఫారీ ప్రారంభం

పచ్చని ప్రకృతి అందాల నెలవు కిన్నెరసాని. ఈ అడవి అందాలను తిలకించడానికి ప్రభుత్వం జంగిల్​ సఫారీని ప్రారంభించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kinnerasani Jungle Safari | పచ్చని ప్రకృతి అందాల నెలవు కిన్నెరసాని. ఎన్నో రకాల పక్షులు, వన్య ప్రాణులు ఇక్కడ ఉంటాయి. పచ్చదనంతో కళకళలాడే కిన్నెరసానిలో ప్రభుత్వం జంగిల్ సఫారీని ప్రారంభించింది. ప్రకృతి అందాలను తిలకించే అవకాశం కల్పించింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిన్నెరసాని అటవీ ప్రాంతం ఉంది. ఇందులో జంగిల్ సఫారీని గురువారం సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) వర్చువల్​గా ప్రారంభించారు. దీంతో పచ్చని అందాలను ఆస్వాదిస్తూ పక్షుల కిలకిలారావాలు వింటూ వన్యప్రాణాలను నేరుగా చూడొచ్చు. ఈ మేరకు మూడు సఫారీ వాహనాలు ఇప్పటికే అక్కడకు చేరుకున్నాయి. వీటి ద్వారా అడవిలో ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. దీంతో కిన్నెరసానికి పర్యాటక శోభ రానుంది.

Kinnerasani Jungle Safari | ట్రెక్కింగ్​కు అవకాశం

Kinnerasani Jungle Safari

జంగిల్​ సఫారీతో పాటు నిపుణుల పర్యవేక్షణలో ట్రెక్కింగ్ చేసుకునే అవకాశాన్ని పర్యాటక శాఖ కల్పించింది. పచ్చదనంలో భద్రాద్రి జిల్లా రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా ఉందని, దీనిని మరింత అభివృద్ధి చేస్తామని అధికారులు తెలిపారు. కిన్నెరసాని డీర్‌ పార్కు నుంచి వాచ్‌ టవర్‌ వరకు, అక్కడ నుంచి మొండికట్ట బేస్‌ క్యాంప్‌ హరిణి వరకు సఫారీ కొనసాగుతుంది. వాచ్‌టవర్‌ వరకు ఒకరికి రూ.100, మొండికట్ట హరిణి వరకై తే రూ.200గా టికెట్‌ ధర నిర్ణయించారు. ఈ సఫారీలో చుక్కల జింకలు, అడవి దున్నలు, సాంబార్​లు కనిపిస్తాయి.

ఇది కూడా చదవండి..: Singareni Workers Issues | సింగరేణికి ప్రభుత్వమే విద్రోహిగా తయారైంది : కవిత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *