అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Losses | పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికే ప్రయత్నాలపై స్విట్జర్లాండ్‌లో ఇరాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడిన తరుణంలో దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేయడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. దీనికితోడు అమెరికాకు చెందిన అతిపెద్ద ఐటీ దిగ్గజ సంస్థ యాక్సెంచర్ తన ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించడంతో దేశీయ ఐటీ షేర్లు సెల్లాఫ్‌కు గురయ్యాయి.
Stock Market Losses | భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 558 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 6 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 389 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 177 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 20 పాయింట్లు పైకి ఎగబాకింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 110 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో చివరలో మార్కెట్లు కోలుకోవడంతో ప్రారంభ నష్టాలు తగ్గాయి. చివరికి సెన్సెక్స్ 607 పాయింట్ల నష్టంతో 76,802 వద్ద, నిఫ్టీ 155 పాయింట్ల నష్టంతో 24,013 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Losses | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,224 కంపెనీలు లాభపడగా 2,002 స్టాక్స్ నష్టపోయాయి. 189 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 169 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 66 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 13 స్టాక్ లాభపడగా.. 17 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎటర్నల్ 2.21 శాతం, ఎయిర్‌టెల్ 1.80 శాతం, పవర్‌గ్రిడ్ 1.32 శాతం, ఎన్టీపీసీ 1.04 శాతం, టైటాన్ 0.84 శాతం లాభపడ్డాయి.
Top Losers : ఇన్ఫోసిస్ 6.69 శాతం, టీసీఎస్ 3.53 శాతం, హెచ్సీఎల్ టెక్ 2.74 శాతం, టెక్ మహీంద్రా 2.47 శాతం, హెచ్డీఎఫ్ సీ బ్యాంక్ 2.32 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Stock Market | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు