అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tellapur Lake | హైదరాబాద్ (Hyderabad) నగరం అంటే కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయింది. పెరిగిన జనాభా, వాహనాల రద్దీతో నగర ప్రజలు తిప్పలు పడుతున్నారు. పెద్ద పెద్ద భవనాలు ఉండే నగరంలో ప్రశాంతంగా సేదతీరడానికి ప్రాంతాలు కరువయ్యాయి.
ప్రశాంతతకు మారుపేరుగా
ముఖ్యంగా నగరంలో చెరువులు కనుమరుగు కావడంతో భూగర్భ జలాలు పెరగడం లేదు. అయితే హైడ్రా నగరంలోని పలు చెరువులను పునరుద్ధరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతోంది. అలాగే హైదరాబాద్‌లోని తెల్లాపూర్ లేక్ (Tellapur Lake) ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తోంది.
సరస్సు చుట్టూ పచ్చదనం

ప్రశాంతమైన నీటి ఉపరితలం, సరస్సు చుట్టూ పచ్చదనం, వెనుక భాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న హై-రైజ్ నివాస టవర్లు కలిసి నగర ఆధునికతకు, సహజ సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తోంది. తెల్లాపూర్ ప్రాంతం ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస కేంద్రాల్లో ఒకటిగా మారింది.
ఇది కూడా చదవండి..: Krait snake bite | స్నేక్‌తో ఆటలు: కట్లపాము కాటుకు ఫామ్‌హౌస్ యజమాని బలి!