April 23 Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. నష్టాలతో ప్రారంభంకానున్న దేశీయ మార్కెట్లు

Naresh Chandan
April 23 Market Analysis

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 23 Market Analysis | పశ్చిమాసియా(West Asia)లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌తో కాల్పుల విరమణను అమెరికా పొడిగించినా హార్మూజ్ జలసంధి వద్ద దిగ్బంధనం కొనసాగుతుండడంతో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ బ్యారెల్‌కు వంద డాలర్లు దాటాయి.

దీంతో గ్లోబల్ మార్కెట్లు(Global markets) నష్టాల బాట పట్టాయి. గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్ లాభాలతో, యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. గురువారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ భారీ నష్టాలతో ఉండడంతో మన మార్కెట్ గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

April 23 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 1.64 శాతం, ఎస్ అండ్ పీ 1.05 శాతం లాభపడ్డాయి. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.64 శాతం నష్టంతో ఉంది.

April 23 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.97 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.31 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.21 శాతం నష్టపోయాయి.

April 23 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.18 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 0.72 శాతం లాభంతో కొనసాగుతుండగా.. జపాన్‌కు చెందిన నిక్కీ 1.09 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.86 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.72 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.12 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.75 శాతం నష్టంతో సాగుతోంది. దీంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

ఎఫ్ఐఐలు వరుసగా మూడో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 2,078 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు. డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 1,048 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(Vix) 1.18 నుంచి 1.02 కు పడిపోయింది. విక్స్ 4.38 శాతం పెరిగి 18.3 వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతోంది. బ్యారెల్‌కు 102.50 డాలర్లకు చేరింది. యూఎస్ డాలర్ ఇండెక్స్ 98.61 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.32 వద్ద ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 29 పైసలు బలహీనపడి 93.79 వద్ద ఉంది. సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.

ఇది కూడా చదవండి: April 23 Gold Rates | బంగారం ధరలకు బ్రేక్.. త‌గ్గుముఖం ప‌ట్టిన‌ వెండి

ఇది కూడా చదవండి: Jacqueline Sukesh letter | లవ్ యూ బుట్ట బొమ్మ జాక్వీ.. ప్రేమతో బేబీ బాయ్ సుఖేశ్!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *