అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Metro Phase 2 | హైదరాబాద్ (Hyderabad) మెట్రో ఫేజ్-2 నిధుల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో కీలక అడుగు వేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఐఆర్ఎఫ్‌సీ (IRFC) రుణ నిధుల విడుదలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ తాజాగా లేఖ రాశారు.
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యపై కిషన్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో జూన్ 22, 23 తేదీల్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, తానే స్వయంగా ఢిల్లీకి వచ్చి పూర్తి వివరాలు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేఖలో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మెట్రో ఫేజ్ -2 విస్తరణకు సంబంధించిన అంశాలు త్వరితగతిన పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని, 2026 జూన్ 16న రాసిన లేఖను ముఖ్యమంత్రి గారు తాజాగా రాసిన లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) నిధుల విడుదలకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారం, మెట్రో ఫేజ్-2 అమలు తదితర కీలక అంశాలను ఆ లేఖలో వివరించినట్లు పేర్కొన్నారు.
Metro Phase 2 | అత్యంత ప్రాధాన్యత
హైదరాబాద్ నగరం రాష్ట్రానికి కీలకమైన ప్రాంతం కావడంతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో రైలు (Metro Phase 2) ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఉందని సీఎం పేర్కొన్నారు. పెండింగ్ అంశాలు సత్వరం పరిష్కారం కావాలని ఆకాక్షించారు. అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించి మెట్రోకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా వివరించి, ముందుకు వెళ్లే మార్గంపై నిర్మాణాత్మక చర్చ జరిపే అవకాశం ఉంటుందని తెలిపారు. చర్చలకు అవసరమైన సంబంధిత ఒప్పందాలు, ఇతర పత్రాల ప్రతులను కూడా వెంట తీసుకువస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమావేశ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుని, సమావేశానికి సంబంధించిన వివరాలను వీలైనంత త్వరగా తెలియజేయాలని కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి కోరారు.
Hon’ble Chief Minister Shri @revanth_anumula has written to Union Minister Shri @kishanreddybjp seeking his support in arranging a meeting with Hon’ble Union Railway Minister Shri @AshwiniVaishnaw ji, to discuss key pending issues concerning the Hyderabad Metro Rail project.… pic.twitter.com/JDNSEWfyl7
— Telangana CMO (@TelanganaCMO) June 20, 2026
దీనిని కూడా చదవండి : Narahari Illegal Assets | ఏసీబీ చరిత్రలోనే రికార్డు.. డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో కట్టలకొద్దీ బయటపడుతున్న అక్రమాస్తులు