IND vs SL | వైభవ్​ విధ్వంసం.. రాయ్​ మెరుపులు.. భారత్​ భారీ స్కోర్​

ముక్కోణపు సిరీస్​లో భాగంగా శ్రీలంక ఏ జట్టుతో జరుగుతున్న ఫైనల్​ మ్యాచ్​లో భారత యువ బ్యాటర్ వైభవ్​ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. దీంతో భారత్​ భారీ స్కోర్​ చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: IND vs SL | ముక్కోణపు సిరీస్​లో భాగంగా శ్రీలంక ఏ జట్టుతో జరుగుతున్న ఫైనల్​ మ్యాచ్​లో భారత యువ బ్యాటర్ వైభవ్​ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. దీంతో భారత్​ భారీ స్కోర్​ చేసింది.

భారత్​–ఏ, శ్రీలంక–ఏ, అఫ్గానిస్థాన్​ –ఏ జట్ల మధ్య ట్రై సిరీస్​ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్​లో ఆదివారం జరిగిన ఫైనల్​లో వైభవ్​ శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు. శ్రీలంక, భారత్​ మధ్య జరిగిన గత మ్యాచ్​లో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మొదట టై అయిన ఆ మ్యాచ్​లో సూపర్​ ఓవర్​లో శ్రీలంక గెలుపొందింది. అయితే ఆ సమయంలో శ్రీలంక క్రికెటర్లు, భారత చిచ్చర పిడుగు వైభవ్​ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఫైనల్​లో వైభవ్​ రెచ్చిపోయి ఆడాడు.

IND vs SL | 11 బంతుల్లో హాఫ్​ సెంచరీ

ఫైనల్​ మ్యాచ్​లో టాస్​ గెలిచిన శ్రీలంక భారత్​ను బ్యాటింగ్​కు ఆహ్వానించింది. దీంతో ఓపెనర్లు ప్రియాన్స్​ ఆర్య, వైభవ్​ సూర్యవంశీ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆర్య నెమ్మదిగా ఆడినా.. వైభవ్​ మాత్రం రెచ్చిపోయాడు. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూయించాడు. 11 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఆ పరుగులు కూడా అన్ని బౌండరీలో రూపంలో రావడం గమనార్హం. 29 బంతుల్లో 94 పరుగులు చేసి వైభవ్​ ఔట్ అయ్యాడు. అప్పటికి భారత్ స్కోర్​ ​ 8.5 ఓవర్లలో 132 పరుగులు. అనంతరం మిగతా బ్యాటర్లు కాస్త నెమ్మదిగా ఆడటంతో స్కోర్​ వేగం తగ్గింది.

IND vs SL | తిలక్​ వర్మ కెప్టెన్​ ఇన్నింగ్స్​

IND vs SL

వైభవ్​ ఔట్​ అయిన తర్వాత శ్రీలంక బౌలర్లు మ్యాచ్​పై పట్టు సాధించారు. కట్టుదిట్టంగా బౌలింగ్​ చేశారు. అయిన భారత బ్యాటర్లు వేగంగా ఆడుతూ స్కోర్​ బోర్డును పరుగులు పెట్టించారు. ప్రియాన్స్​ ఆర్య 29 బంతుల్లో 39 పరుగులు, రుతురాజ్​ గైక్వాడ్​ 51 బంతుల్లో 40 పరుగులు చేశాడు. వికెట్లు పోవడంతో కెప్టెన్​ తిలక్​వర్మ నెమ్మదిగా ఆడి ఇన్నింగ్స్​ను చక్కదిద్దాడు. 90 బంతుల్లో 67 పరుగులు చేశాడు. కుమార్​ కుశాగ్ర 36, విప్రజ్​ నిగమ్ 27 పరుగులతో రాణించారు.

చివర్లో అంకుల్​ రాయ్ 15 బంతుల్లో 39 పరుగులతో సత్తా చాటాడు.వైభవ్​ బ్యాటింగ్​ చేసే సమయంలో భారత్ 400 పరుగులు చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే అతడు ఔట్ అయ్యాక స్కోర్​ బోర్డు నెమ్మదించింది. దీంతో 50 ఓవర్లలో భారత్ 9 వికెట్లు కోల్పోయి 377 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో రవింద్​ ఫెర్నాండో, వనుజ షాహన్​ చెరో రెండు వికెట్లు తీశారు.

ఇది కూడా చదవండి..: Vaibhav Suryavanshi | వైభవ్​ సూర్యవంశీ వీర విహారం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *