అక్షరటుడే, కామారెడ్డి : Overloaded Vehicles Seized | జిల్లాలో ఓవర్‌లోడ్‌తో చెలరేగిపోతున్న భారీ వాహనాలపై రవాణాశాఖ అధికారులు కొరడా ఝళిపించారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆదేశాలు, జాయింట్ ట్రాన్స్ పోర్టు కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, ఉమ్మడి నిజామాబాద్ డీటీసీ దుర్గ ప్రమీల సూచనల మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Overloaded Vehicles Seized | ఆకస్మిక తనిఖీలలో..
శనివారం రాత్రి వరకు చేపట్టిన ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి లోడ్‌తో తిరుగుతున్న మూడు భారీ వాహనాలను గుర్తించి సీజ్ చేసినట్లు జిల్లా రవాణాధికారి టి.సంతోష్ కుమార్ వెల్లడించారు. ఓవర్‌లోడ్ వల్ల రోడ్లు దెబ్బతినడంతో పాటు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని, క్వారీ నిర్వాహకులు, లారీ యజమానులు, డ్రైవర్లు ఎవరూ నిబంధనలు అతిక్రమించవద్దని డీటీఓ హెచ్చరించారు. మరోసారి ఓవర్‌లోడ్‌తో పట్టుబడితే వాహనాలు సీజ్ చేయడమే కాకుండా భారీ జరిమానాలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా జిల్లాలోని ప్రధాన రహదారులన్నింటిపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన తెలిపారు. కాగా ఆదివారం కూడా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఇప్పటివరకు మరొక రెండు వాహనాలు సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. రాత్రి వరకు మరికొన్ని వాహనాలు సీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ఎంవీఐ శంకర్ నారాయణ, ఏఎంవీఐలు రఫీ, కృష్ణ తేజ, రవాణాశాఖ కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Ganja Smuggling Network | దర్జాగా గంజాయి దందా.. రైల్వే మార్గమే అడ్డాగా తరలింపు..