Reliance Stock Rally | రిలయన్స్ దూకుడు.. భారీ లాభాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో పయనిస్తోంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 493 పాయింట్లు, నిఫ్టీ 148 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Reliance Stock Rally | అమెరికా, ఇరాన్‌లు శాంతి చర్చలలో పురోగతి సాధించడంతో ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. దీనికితోడు ఇండెక్స్‌లలో కీలక వెయిటేజ్ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లలో కొనుగోళ్ల మద్దతు, ఐటీ రంగ షేర్లలో రిలీఫ్ ర్యాలీతో సూచీలు రాణిస్తున్నాయి.

Reliance Stock Rally | లాభాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 358 పాయింట్ల లాభంతో ప్రారంభమై 152 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 313 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో ప్రారంభమై 33 పాయింట్లు తగ్గింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి 95 పాయింట్లు పైకి ఎగబాకింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 493 పాయింట్ల లాభంతో 77,295 వద్ద, నిఫ్టీ 148 పాయింట్ల లాభంతో 24,160 వద్ద ఉన్నాయి.

Reliance Stock Rally

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 21 స్టాక్స్ లాభాలతో, 9 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్ 2.26 శాతం, టెక్ మహీంద్రా 1.84 శాతం, ఇన్ఫోసిస్ 1.57 శాతం, హెచ్సీఎల్ టెక్ 0.96 శాతం, హెచ్డీఎఫ్ సీ బ్యాంక్ 0.94 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : టైటాన్ 1.02 శాతం, అదానీపోర్ట్స్ 0.93 శాతం, ఆసియన్ పెయింట్ 0.70 శాతం, ఐటీసీ 0.55 శాతం, పవర్‌గ్రిడ్ 0.48 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Premarket analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. ఫ్లాట్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *