Bodhan MIM Protest | బోధన్​ బల్దియాలో కలకలం.. టెంట్​ వేసుకుని ఎంఐఎం కౌన్సిలర్ల ధర్నా..

పట్టణంలో ఎంఐఎం కౌన్సిలర్లు నిరసన బాట పట్టారు.

Shashi kiran Mottala

అక్షరటుటే, బోధన్​: Bodhan MIM Protest | పట్టణంలో ఎంఐఎం కౌన్సిలర్లు (MIM Councilors) నిరసన బాట పట్టారు. స్థానిక బల్దియా కార్యాలయం ఎదుట సోమవారం టెంట్ వేసుకొని మరీ ధర్నా చేస్తున్నారు.

Bodhan MIM Protest | మూడు నెలలుగా లేని కౌన్సిల్ మీటింగ్​లు..

మున్సిపల్ పాలకవర్గం ఏర్పడి మూడు నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా కౌన్సిల్ మీటింగ్ నిర్వహించలేదని ఎంఐఎం కార్పొరేటర్లు ఆరోపించారు. ఈ సందర్భంగా బల్దియా వైస్ ఛైర్మన్ ఇలియాస్ మాట్లాడుతూ పట్టణంలో శానిటైజేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. పాలకవర్గం సమావేశం నిర్వహించి అధికారులకు సూచనలు సలహాలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు సమావేశం నిర్వహించకపోవడంతో పట్టణంలో పాలన గాడి తప్పిందన్నారు.

Bodhan MIM Protest | ప్రజల్లో తిరిగేందుకు ఇబ్బంది పడుతున్నాం..

కాలనీల్లో ఎలాంటి సమస్యలు పరిష్కారం కావట్లేదని.. దీంతో ప్రజల మధ్య తిరగలేకపోతున్నామని వైస్​ ఛైర్మన్​ అన్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Bodhan MIM Protest | పసుపు వాగులో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు..

పట్టణ శివారులోని పసుపు వాగులో దర్జాగా బల్దియా బీసీబీలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయని ఇది ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వాల్టా చట్టాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. పట్టణంలో పాలనను తక్షణమే గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని మున్సిపల్ పాలకవర్గం వెంటనే కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని వారు డిమాండ్​చేశారు.  ఈ విషయమై కమిషనర్​ను వివరణ కోరగా.. ఆర్నెళ్ల వరకు సమావేశాలు నిర్వహించుకోవచ్చనే రూల్​ ఉందని.. తదిపరి విషయాలపై అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)​తో మాట్లాడేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ధర్నాలో ఎంఐఎం కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Electric Shock | బోధన్​లో విషాదం.. విద్యుత్ షాక్​తో దంపతుల మృతి

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *