అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sandhya Theatre Stampede Case | సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు విచారణను కోర్టు జులై 6కు వాయిదా వేసింది. ఈ కేసులో సోమవారం విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు (Nampally Court) ఇటీవల హీరో అల్లు అర్జున్‌తో పాటు పలువురికి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
పుష్ప–2 సినిమా ప్రీమియర్ సమయంలో హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో గల సంధ్యా థియేటర్లో తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. హీరో అల్లు అర్జున్ (Allu Arjun) థియేటర్‌కు రావడంతో ఆయనను చూడటానికి అభిమానులు ఒక్కసారిగా లోపలకి వచ్చారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడితో పాటు పలువురు గాయపడ్డారు. ఈ కేసులో 12 నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే విచారణకు ఆయన హాజరు కాలేదు.
Sandhya Theatre Stampede Case | ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు
అల్లు అర్జున్ హాజరుకానందున మెమో దాఖలు చేయాలని కోర్టు సూచించింది. విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకు 12 మంది నిందితులు హాజరు అయ్యారు. బన్నీ తరఫు న్యాయవాదులు ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆన్లైన్ లో విచారణకు అనుమతించాలని అల్లు అర్జున్ పిటిషన్ వేశారు. దానిని అనుమతించపోవడంత ఆబ్సెంట్ పిటిషన్ వేశారు. ముందే ఫిక్స్ అయిన షెడ్యూల్ వల్ల ముంబైలో ఆయన ముంబైలో ఉన్నారని తెలిపారు. దీంతో కోర్టు విచారణను జులై 6కు వాయిదా వేసింది. జూలైన 6 విచారణకు కూడా వర్చువల్‌గా హాజరవుతారని కోర్టుకు అల్లు అర్జున్ న్యాయవాది తెలిపారు.
ఇది కూడా చదవండి..: Klimkara face reveal | ఎట్టకేలకు మెగా ప్రిన్సెస్ ‘క్లీంకార’ ఫేస్ రివీల్.. నెట్టింట రామ్ చరణ్, ఉపాసన దంపతుల క్యూట్ పిక్ వైరల్!