Sudarshan Reddy Visit | నగరంలో ప్రభుత్వ సలహాదారు విస్తృత పర్యటన..

ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం విస్తృతంగా పర్యటించారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​ : Sudarshan Reddy Visit | ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం విస్తృతంగా పర్యటించారు. అధికారులతో సమీక్షలు జరిపారు.

Sudarshan Reddy Visit | నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో..

నగరంలోని ఖిల్లా రోడ్డు, ఫ్రూట్ మార్కెట్, పులాంగ్ పాత తహశీల్దార్​ ఆఫీస్ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న భవనాలను ఆయన పరిశీలించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi), మున్సిపల్ కార్పొరేషన్ కమిషర్​ దిలీప్​కుమార్​తో మాట్లాడారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వానలు మరింత పెరగకముందే తొలగించాలని.. నగరవాసులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అలాగే నగరంలోని భారీ డ్రైనేజీలపై గ్రిల్స్ ఏర్పాటు చేయాలని తాగునీటి సరఫరాలకు ఇబ్బంది లేకుండా వాటర్ వర్క్స్ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. సమీక్షలో మున్సిపల్​ అధికారులు పాల్గొన్నారు.

Sudarshan Reddy Visit

ఇది కూడా చదవండి..: Bodhan MIM Protest | బోధన్​ బల్దియాలో కలకలం.. టెంట్​ వేసుకుని ఎంఐఎం కౌన్సిలర్ల ధర్నా..

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *