అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: NEET Paper Leak | ‘నీట్’ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు. పేపర్ లీక్‌కు నిరసన తెలుపుతూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) నిరసనకు ఆయన మంగళవారం మద్దతు తెలిపారు.
NEET Paper Leak | దేశ యువత భవిష్యత్తు అంధకారం..
ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ ‘నీట్’ లీక్ ద్వారా దేశంలోని లక్షల యువత భవిష్యత్తును ఆగం చేశారన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం (Central Government) విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమేనని పేర్కొన్నారు. ‘నీట్’ ఒక పరీక్ష కాకుండా వేలంలా మారిపోయిందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివిన దానికి న్యాయం జరగాలని, వ్యవస్థలు బాధ్యతలో వ్యవహరించాలని అన్నారు. ఢిల్లీ రాజధానిలో ఎంతో మంది విద్యార్థులు నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు.
యువకులు డిమాండ్ చేస్తున్నట్టుగా విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. దేశ భవిష్యత్తు యువకులపైనే ఉందనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని, వారికి ఎలాంటి కష్టం వచ్చినా ముందుండి పోరాటం చేస్తున్నారన్నారు. యువకులకు న్యాయం జరిగే విధంగా రాహుల్ గాంధీ ఆందోళన ఉధృతం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామ్ మోహన్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నవీపేట్ శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ నితిన్,కిష్టా గౌడ్,జావీడ్, రాములు, సాయిరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Tadwai Protest | తాడ్వాయిలో హై టెన్షన్.. మండల కేంద్రం అష్టదిగ్బంధనం