Hyderabad Metro controversy | మెట్రో ఆస్తులపై రేవంత్ కుట్రలు : కేటీఆర్

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Metro controversy | హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శేరిలింగంపల్లిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన, మెట్రో విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Hyderabad Metro controversy | ఎల్ అండ్ టీని పంపేశారు..

సుమారు రూ. 30 వేల కోట్ల విలువైన మెట్రో ఆస్తులను తన కుటుంబ సభ్యులకు, అనుచరులకు కట్టబెట్టాలనే కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఎల్ అండ్ టీ అధికారులను బ్లాక్ మెయిల్ చేసి, వారిని రాష్ట్రం నుండి పంపించేశారని ఆయన పేర్కొన్నారు. కేవలం తమ స్వార్థం కోసమే రూ. 14,000 కోట్ల అప్పు భారాన్ని ప్రజలపై రుద్దుతున్నారని మండిపడ్డారు.

Hyderabad Metro controversy | ప్రశ్నించిన కేటీఆర్..

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు బీజేపీ ప్రభుత్వం ఎందుకు అడ్డంకులు సృష్టించిందో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎయిర్‌పోర్ట్ మెట్రోను రద్దు చేసిన రేవంత్ రెడ్డికి, విస్తరణకు సహకరించని కిషన్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి తుగ్లక్, హిట్లర్ ఆదర్శమని.. మెట్రో భూములను ఎలా అమ్మబోతున్నారో, ఎవరు కొంటారో రాబోయే రోజుల్లో ప్రజలందరూ చూస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. మొదటి దశ మెట్రోను తామే పూర్తి చేశామని, రెండో దశ మెట్రో పట్టాలెక్కాలంటే మళ్లీ కేసీఆర్ నాయకత్వమే రావాలని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:  SRSP Eco Tourism | ఎస్‌ఆర్‌ఎస్‌పీ బ్యాక్‌వాటర్ పరిధిలో ఎకో టూరిజం అభివృద్ధి..: స్థానిక యువతకు ప్రత్యేక శిక్షణ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *