Lingampet BJP | గుండెపోటుతో బీజేపీ సీనియర్​ నాయకుడు మృతి

లింగంపేట​ మండల కేంద్రంలో విషాదం నెలకొంది. బీజేపీ సీనియర్​ నాయకుడు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహారాజుల మురళి గుండెపోటుతో మృతి చెందారు.

shashi kiran Mottala

అక్షరటుడే, లింగంపేట: Lingampet BJP | మండల కేంద్రంలో విషాదం నెలకొంది. బీజేపీ సీనియర్​ నాయకుడు ఓబీసీ మోర్చా (OBC Morcha) జిల్లా అధ్యక్షుడు మహారాజుల మురళి గుండెపోటుతో మృతి చెందారు.

Lingampet BJP | నమ్మిన సిద్ధాంతానికి మారుపేరు..

లింగంపేట (Lingampet) మండల కేంద్రానికి చెందిన మహారాజుల మురళి హిందుతత్వవాది అని ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుడని స్థానిక బీజేపీ నాయకులు పేర్కొన్నారు. రామ్ మందిర్ కరసేవకుడిగా సేవలందించారన్నారు. అనేక పోరాటాలు, హిందుత్వం కోసం కృషిచేసిన గొప్ప నాయకుడని ఆయన మృతి పట్ల లింగంపేట ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తీవ్రగా కృషి చేశాడన్నారు. మండలంలో బీజేపీ బలోపేతం అయ్యేందుకు ఆయన శాయాశక్తులా ప్రయత్నించాడన్నారు.

rss

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *