Indiramma Bus Yatra | తెలంగాణలో ‘ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర’.. సీఎంను కలిసిన ప్రతినిధులు..

తెలంగాణలో లంబాడి, ఎరుకల, యానాది తెగలకు రిజర్వేషన్లు కల్పించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Indiramma Bus Yatra | తెలంగాణలో లంబాడి, ఎరుకల, యానాది తెగలకు రిజర్వేషన్లు (Tribal Reservations) కల్పించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లోక్​ సభ సభ్యుడు బలరామ్​నాయక్​ ఆధ్వర్యంలో  రాష్ట్రంలో ‘ఇందిరమ్మ ఆశీర్వాద బస్సుయాత్ర’ను నిర్వహిస్తున్నారు.

Indiramma Bus Yatra | సీఎంను కలిసిన ప్రతినిధులు..

స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రతినిధి బృందం రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తూ బుధవారం హైదరాబాద్​లో సీఎం రేవంత్​రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డికి (CM Revanth Reddy) బస్సుయాత్ర ఉద్దేశాన్ని బృందం సభ్యులు వివరించారు. 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో లోక్‌సభ సభ్యుడు బలరామ్ నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే బాలు నాయక్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఉన్నారు.

revanth.1 3

ఇది కూడా చదవండి: snapped at event in Hyderabad

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *