అక్షరటుడే, వెబ్‌డెస్క్: Karnataka Projects Impact | తుంగభద్రలో మన నీటి వాటాకు తూట్లు పొడిచే పనికి సీఎం రేవంత్ (CM Revanth Reddy) మద్దతు తెలుపుతున్నారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఆర్డీఎస్ చుట్టు కర్ణాటక చేపట్టే ప్రాజెక్ట్ లతో మనం నీటి హక్కును కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. మన హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి…కర్ణాటక దోపిడీకి వంత పాడుతున్నారని విమర్శించారు.
ఆర్డీఎస్ మీద నిర్మించి ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వెళ్లవద్దని కవిత అన్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రాజెక్ట్‌లతో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఆర్డీఎస్ ప్రాజెక్ట్ ఉమ్మడి మహబూబ్ నగర్‌కు ఉపయోగపడే ప్రాజెక్ట్ అని తెలిపారు. ఇందులో మనకు 16 టీఎంసీల వాటా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో గానీ తెలంగాణ వచ్చిన తర్వాత గానీ 6 టీఎంసీల కన్నా ఎక్కువ వాడుకోలేదని విమర్శించారు.
Karnataka Projects Impact | కేసీఆర్ పట్టించుకోలేదు

మన నీటిని పూర్తిస్థాయిలో వాడుకునేందుకు ఆర్డీఎస్ చుట్టుపక్కల రిజర్వాయర్లను బలోపేతం చేయాల్సి ఉందని కవిత (Kalvakuntla Kavitha) పేర్కొన్నారు. అయితే ఆనాడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ సర్కార్ దాన్ని పట్టించుకోలేదని తెలిపారు. దీంతో నడిగడ్డకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక కురిడి, కల్పగల్ గ్రామాల్లో 2 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు నిర్మిస్తోందని కవిత చెప్పారు. ఆర్డీఎస్కు 15 కి.మీ.ల ఎగువన చిక్కాలపర్వి వద్ద 2.50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బ్యారేజ్ నిర్మిస్తోందన్నారు. మొత్తంగా ఆర్డీఎస్కు ఎగువన, దిగువ 10 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టులు చేపడుతోందన్నారు.
ఇది కూడా చదవండి..: Tungabhadra Crest Gates | తుంగభద్ర 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభం