Operation Kavach Success | బాన్సువాడలో నాటు తుపాకుల తయారీ.. 8 మంది అరెస్ట్​

బాన్సువాడ కేంద్రంగా నాటు తుపాకులు తయారు చేస్తున్న ముఠా గుట్టును కామారెడ్డి పోలీసులు రట్టు చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Operation Kavach Success | బాన్సువాడ కేంద్రంగా నాటు తుపాకులు తయారు చేస్తున్న ముఠా గుట్టును కామారెడ్డి పోలీసులు (Kamareddy Police) రట్టు చేశారు. తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు అడవి జంతువుల అక్రమ వేటకు పాల్పడుతున్న మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Operation Kavach Success | గాంధారి పీఎస్​ పరిధిలోని..

ఈ మేరకు ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) మీడియాకు వివరాలు వెల్లడించారు. బుధవారం రాత్రి గాంధారి పీఎస్ పరిధిలోని మొండి సడక్ చౌరస్తా వద్ద గాంధారి ఎస్సై మహేందర్, సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బజాజ్, హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిళ్లపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి పట్టుకుని విచారించగా అడవి జంతువుల వేట కోసం నాటు తుపాకులు కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్లు అంగీకరించారు. వారి వద్ద 2 నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.

వారిచ్చిన సమాచారంతో ఎస్పీ ఆదేశాల మేరకు సదాశివనగర్ సీఐ, గాంధారి, తాడ్వాయి ఎస్‌ఐలు, సిబ్బందితో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దాడులు నిర్వహించారు. నిందితులు సలావత్ చందర్, ఆంగోత్ ధర్మ నాయక్ అలియాస్​ ధర్మ, బాన్సువాడకు చెందిన అస్లాం దావుస్‌లు నిజాంపేట్, బాన్సువాడ మండలాల్లోని చిన్నరాంపూర్, హాజీపూర్ గ్రామాల్లో ఒకొక్క తుపాకీని రూ.10వేలకు విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు.

Operation Kavach Success | గండివేట్​ తండాకు చెందిన..

గండివేట్ తండాకు చెందిన విస్లావత్ అరుణ్, విస్లావత్ గోపిచంద్, ఆంగోత్ లక్ష్మణ్, విస్లావత్ నాను, విస్లావత్ గణేశ్‌లు నిందితులుగా ఉన్నారని ఎస్పీ తెలిపారు. మూడు గన్​లకు ట్రిగ్గర్ మెకానిజమ్‌లు లేకపోవడంతో గండివేట్ తండా సమీపంలో పొలంలో దాచిపెట్టినట్లు చెప్పగా, స్వాధీనం చేసుకున్నారని వివరించారు. జిల్లాలో అక్రమ ఆయుధాల సంస్కృతికి, వన్యప్రాణుల వేటకు తావులేదని ఎస్పీ హెచ్చరించారు. నేరస్తులకు సింహస్వప్నంగా, ప్రజలకు రక్షణగా ‘ఆపరేషన్ కవచ్’ ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందని, చట్టవ్యతిరేక చర్యలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.

Operation Kavach Success

 

నిందితుల నుంచి 5 నాటు తుపాకులు, ఒక ఎయిర్ గన్, 3 ట్రిగ్గర్ మెకానిజమ్‌లు, 3 చాప్స్, స్టీల్ పెలెట్స్, గన్‌పౌడర్, పొటాష్, ఫ్లెట్స్‌తో పాటు భారీగా వేట సామగ్రి, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అక్రమ ఆయుధాల సరఫరా, వన్యప్రాణుల వేట ముఠా నెట్‌వర్క్‌ను ఛేదించిన సదాశివనగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్, గాంధారి ఎస్‌ఐ మహేందర్, తాడ్వాయి ఎస్‌ఐ నరేశ్, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ రావు, సీఐ సంతోష్ కుమార్, గాంధారి, తాడ్వాయి ఎస్సైలు మహేందర్, నరేష్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kerala teacher suicide | కామారెడ్డిలో కలకలం: పాఠశాల క్వార్టర్స్‌లో కేరళ ప్రైవేట్ టీచర్​ సూసైడ్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *