అక్షరటుడే, వెబ్‌డెస్క్: Draksharam Fire | ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా (Konaseema District) ద్రాక్షారామ కూరగాయల మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అగ్ని ప్రమాదంలో 40కి పైగా దుకాణాలు కాలి బూడిద అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, సహాయక చర్యలకు ఆదేశించారు. షార్ట్ సర్క్యూట్‌తోనే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 కోట్ల ఆస్తి నష్టంజరిగినట్లు బాధితులు తెలిపారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Draksharam Fire | న్యాయం చేస్తాం
కాలిపోయిన వాటిలో పది వరకు కిరాణా దుకాణాలు, మిగతావి కూరగాయలు, మాంసం దుకాణాలు ఉన్నాయి. ఒక్కో కిరాణా దుకాణంలో రూ.10 లక్షల పై చిలుకు విలువ చేసే సరుకులు ఉన్నట్లు యజమానులు తెలిపారు. మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో సామగ్రి బయటకు తీసే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అగ్నిప్రమాదం
రామచంద్రపురం మండలం ద్రాక్షారామ కూరగాయల మార్కెట్లో అగ్నిప్రమాదం
30 వరకు షాపులు దగ్ధం.. దుకాణాల్లోని కూరగాయలు, సరుకులు అగ్నికి ఆహుతి
విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్న స్థానికులు
మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది pic.twitter.com/BcOYChmGq0
— Telugu Feed (@Telugufeedsite) June 26, 2026
ఇది కూడా చదవండి..:Janu Missing Case | జాను మిస్సింగ్ కేసు.. కుక్క మృతిపై క్లియర్ అయిన అనుమానాలు