అక్షరటుడే, వెబ్డెస్క్ : Kethireddy Dharna | అనంతపురం జిల్లా (Anantapur District) తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం ఉదయం ధర్నాకు దిగారు. ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో హైటెన్షన్ నెలకొంది.
తాడిపత్రిలో రోడ్డుపై బైఠాయించి కేతిరెడ్డి పెద్దారెడ్డి ధర్నా చేశారు. ఆయనను పోలీసులు ఇంటికి తరలించారు. ఆందోళన ఉధృతం కాకుండా చర్యలు చేపట్టారు. ధర్నా స్థలం నుంచి వైసీపీ శ్రేణులను తరలించారు. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి తాడిపత్రికి రాకుండా వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటునారు. వైసీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, విశ్వేశ్వర రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. గృహనిర్బంధ ప్రయత్నాలను నిరసిస్తూ నేతలు రోడ్డుపై బైఠాయించగా, పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు భారీ ధర్నాకు దిగాయి.
Kethireddy Dharna | వైసీపీ శ్రేణుల ఆగ్రహం

పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు యత్నించారు. పెద్దారెడ్డి మాట్లాడుతూ.. పోలీసుల కనుసన్నల్లో మట్కా, గంజాయి సాగు చేస్తున్నారంటూ ఆరోపించారు. పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డికు తొత్తులుగా మారారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దారెడ్డి ఇంటికి వెళ్లకుండా నాలుగు వైపుల పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.
తాడిపత్రిలో ఉద్రిక్తత
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిబయట రోడ్డుపై బైఠాయించి నిరసన
తాడిపత్రిలో ప్రజాస్వామ్యం కాపాడాలి అంటూ నిరసన
పోలీసులు కనుసన్నల్లో మట్కా, గంజాయి సాగు చేస్తున్నారంటూ పెద్దారెడ్డి నినాదాలు
పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డికు తొత్తులుగా పోలీసులు మారారు… pic.twitter.com/VvLd1LEnM8
— Anitha Reddy (@Anithareddyatp) June 26, 2026
ఇది కూడా చదవండి..: Draksharam Fire | ద్రాక్షారామ కూరగాయల మార్కెట్లో అగ్నిప్రమాదం.. రూ.2 కోట్ల ఆస్తి నష్టం