అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ramakrishna Rao Appointed | రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుత సీఎస్ రామకృష్ణా రావును నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు కొనసాగుతున్నారు. జూన్ 30న ఆయన పదవి విరమణ చేయనున్నారు. దీంతో కొత్త సీఎస్‌గా ప్రభుత్వం 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నియమించింది. ఈ క్రమంలో రామకృష్ణారావును సీఎం ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాకుండా మరో 13 మంది ఐఏఎస్ అధికారులను సైతం బదిలీ చేసింది.
Ramakrishna Rao Appointed | శైలజ రామయ్యర్ బదిలీ

ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శైలజ రామయ్యర్ (ప్రధాన సంక్షేమ & అభివృద్ధి పథకాల అమలు విభాగం, కార్పొరేట్ సామాజిక బాధ్యత)ను బదిలీ చేశారు. ఆమె స్థానంలో సబ్యసాచి ఘోష్‌ను నియమించారు. సబ్యసాచి ఘోష్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సంక్షేమ పదవులకు ఎఫ్ఏసీ (FAC) గా కొనసాగుతారు. శైలజ రామయ్యర్ ఈఎఫ్ఎస్&టి శాఖ ప్రభుత్వ కార్యదర్శిగా బదిలీ చేశారు. రెవెన్యూ శాఖలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఎండోమెంట్స్) పదవికి ఎఫ్ఏసీలో ఆమె నియమితులయ్యారు.వీరితో పాటు ఐఏఎస్ అధికారులు అహ్మద్ నదీమ్, ఎన్. శ్రీధర్, రాహుల్ బోజ్జా, బి. అజిత్ రెడ్డి, మహమ్మద్ ముషారఫ్ అలీ ఫరూఖీ, పి. కాత్యాయనీ దేవి, పి. ప్రవీణ్య, టి. వెంకన్న కె. విద్యాసాగర్, కె. చంద్రకళలను సైతం ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది.
ఇది కూడా చదవండి..: Sanjay Jaju | తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు నియామకం