అక్షరటుడే, ఇందూరు: OBC Morcha | రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర (BJP Telangana) అధ్యక్షుడు రాంచందర్ రావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
OBC Morcha | జిల్లా ఓబీసీ అధ్యక్షుడిగా..
రాష్ట్రంలో 21 జిల్లాలకు సంబంధించి బీజేపీ ఓబీసీ అధ్యక్షులను నియమించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఓబీసీ(BJP Nizamabad) అధ్యక్షుడిగా బొబ్బిలి వేణుగోపాల్(Bobbili Venugopal) నియమితులయ్యారు. నగరంలో సీనియర్ నాయకుడిగా సేవలందిస్తున్న ఆయనను అధిష్టానం గుర్తించి ఈ పదవిని కట్టబెట్టింది. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ.. పార్టీ తన సేవలను గుర్తించి పదవి ఇచ్చిందని.. శాయాశక్తులా ఈ పదవికి న్యాయం చేస్తానన్నారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్తామని జిల్లాలోని ఓబీసీలను కలుపుకుని ముందుకు వెళ్తానని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో విషాదకర ఘటన