Revenue Tampering | కలెక్టర్​ సంచలన నిర్ణయం.. రికార్డ్​ అసిస్టెంట్​పై వేటు

రికార్డులు తారుమారు చేసిన రెవెన్యూ అధికారిపై వేటు పడింది. ఈ మేరకు కలెక్టర్​ ఇలా త్రిపాఠి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Revenue Tampering | రికార్డులు తారుమారు చేసిన రెవెన్యూ అధికారిపై(Record Assistant) వేటు పడింది. ఈ మేరకు కలెక్టర్​ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Revenue Tampering | నగరంలోని నార్త్​ తహశీల్దార్​ కార్యాలయంలో..

నిజామాబాద్(Nizamabad) నార్త్ తహశీల్దార్ కార్యాలయంలో(Tahsildar Office) రికార్డు అసిస్టెంట్​గా విధులు నిర్వహిస్తున్న జె రాహుల్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ రికార్డుల (పహాణీల)లో అక్రమ మార్పులు చేయడం, రికార్డుల తారుమారు, విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా పాలనాధికారి కఠిన చర్యలకు ఉపక్రమించారు. సదరు ఉద్యోగిని సస్పెండ్ చేయడంతో పాటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.

Revenue Tampering | కంఠేశ్వర్​ ప్రాంతంలో..

నిజామాబాద్ నార్త్ మండలం పరిధిలోని కంఠేశ్వర్ ప్రాంతంలో సర్వే నంబర్లు 291/ఏ, 291ఏఏ, 292లకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో టాంపరింగ్ జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించి ప్రాథమిక విచారణ జరిపించారు. రెవెన్యూ రికార్డుల టాంపరింగ్ వాస్తవమేనని విచారణలో వెల్లడైంది. దీంతో విచారణ నివేదిక ఆధారంగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న రికార్డు అసిస్టెంట్ జే రాహుల్​ను సస్పెండ్ చేస్తూ శాఖాపరంగా సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన విచారణ అనంతరం సమగ్ర నివేదికను అనుసరిస్తూ తదుపరి చర్యలు ఉంటాయని కలెక్టర్ వెల్లడించారు. రెవెన్యూ రికార్డుల్లో అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్​ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: వైసీపీ నేతలను తగ్గించాలని నేనెందుకు అనుకుంటా..? 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *