అక్షరటుడే, బాన్సువాడ: Kalki Cheruvu Repairs | పట్టణంలోని కల్కి చెరువు బుంగ మరమ్మతు పనులను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఆగ్రోస్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్‌తో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు.
Kalki Cheruvu Repairs | నాణ్యతలో తేడా రావొద్దు..
ఎమ్మెల్యే పోచారం (MLA Pocharam) మాట్లాడుతూ.. కల్కి చెరువు బుంగ మరమ్మతు పనుల కోసం ప్రభుత్వం రూ.27.60 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. పనుల్లో ఎలాంటి నాణ్యత లోపాలు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. భవిష్యత్‌లో మళ్లీ సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేయాలని అధికారులకు సూచించారు. కల్కి చెరువు ద్వారా అనేక మంది రైతులకు సాగునీరు అందుతున్నందున మరమ్మతు పనులను వేగంగా పూర్తిచేసి నీటి వృథాను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ శ్రీచంద్, ఏఈ నితిన్, జంగం గంగాధర్, ఏజాస్, కృష్ణారెడ్డి, నార్ల సురేష్, బాబా తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Pulse Polio Campaign | పోలియో రహిత సమాజం మనందరి లక్ష్యం..