RM1 Coders Hub Scam | బ్యాక్‌డోర్ జాబ్స్ పేరుతో భారీ స్కామ్.. రూ. 5 కోట్లు టోకరా

గచ్చిబౌలిలోని వాసవి స్కై సిటీలో కార్యాలయం ఏర్పాటు చేసి, బ్యాక్‌డోర్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ఆశపెట్టి, రూ.కోట్ల వసూళ్లకు పాల్పడిన 'RM1 కోడర్స్ హబ్' (RM1 Coders Hub Software Solutions) నిర్వాహకుల బండారం బయటపడింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: RM1 Coders Hub Scam | గచ్చిబౌలిలోని వాసవి స్కై సిటీలో కార్యాలయం ఏర్పాటు చేసి, బ్యాక్‌డోర్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ఆశపెట్టి, రూ.కోట్ల వసూళ్లకు పాల్పడిన ‘RM1 కోడర్స్ హబ్’ (RM1 Coders Hub Software Solutions) నిర్వాహకుల బండారం బయటపడింది. సుమారు 250 మంది యువత నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 2 లక్షల చొప్పున వసూలు చేసిన యాజమాన్యం, జీతాలు చెల్లించకుండా కార్యాలయానికి తాళం వేసి పరారైంది.

RM1 Coders Hub Scam | ఏం జరిగింది?

నిందితులు రాము మామిడి, జయంత్ కుందేటి కలిసి సెప్టెంబర్ 2025లో గచ్చిబౌలి వాసవి స్కై సిటీ 8వ అంతస్తులో ఈ సంస్థను ప్రారంభించారు. కన్సల్టెన్సీల ద్వారా బ్యాక్‌డోర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, ఒక్కొక్క అభ్యర్థి నుంచి రూ. 2 లక్షలు వసూలు చేశారు. ఇలా 250 మందిని రిక్రూట్ చేసుకున్న తర్వాత, కంపెనీ ఇది స్టార్టప్ అని, కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయని నమ్మబలికారు. జీతాల కోసం అడిగిన ప్రతిసారీ ‘ఓపిక పట్టండి, పెండింగ్ జీతాలన్నీ ఒకేసారి జమ చేస్తాం’ అంటూ కాలక్షేపం చేశారు.

RM1 Coders Hub Scam | మోసం బయటపడిందిలా..

2026 జనవరి వరకు కూడా ఒక్క రూపాయి జీతం రాకపోవడంతో, బాధితులు నిలదీయడం ప్రారంభించారు. అప్పటి వరకు తమ మోసాన్ని కొనసాగించిన నిర్వాహకులు, అకస్మాత్తుగా కార్యాలయానికి తాళాలు వేసి పరారయ్యారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

RM1 Coders Hub Scam | భయం లేకుండా తిరుగుతున్న నిందితులు..

ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు రాము మామిడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే, కేసు నమోదైనప్పటికీ నిందితులు రాము మామిడి, జయంత్ కుందేటి , రాము తండ్రి మామిడి కనకయ్య అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తొలుత వార్తలు వచ్చాయి. కానీ, ప్రస్తుతం వారు ఎలాంటి భయం లేకుండా యథేచ్ఛగా నగరంలో తిరుగుతున్నారని, చట్టం తమను ఏమీ చేయలేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

RM1 Coders Hub Scam | పోలీసుల దర్యాప్తు..

కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల ఫోన్ కాల్స్ డేటా, బ్యాంక్ ట్రాన్సాక్షన్లను విశ్లేషిస్తున్నారు. బాధితుల సంఖ్య 250కి పైగా ఉండటంతో, నిందితులు సుమారు రూ. 5 కోట్లకు పైగా వసూలు చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని స్థానిక యువత కోరుతున్నారు.

 

ఇది కూడా చదవండి: US Iran Airstrikes | 10 ఇరాన్ స్థావరాలపై దాడులు.. ఫుటేజ్‌ విడుదల చేసిన అమెరికా..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *