అక్షరటుడే, వెబ్డెస్క్: Fee Reimbursement | రాష్ట్రంలోని ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) శుభవార్త అందించింది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించేందుకు గాను, ప్రభుత్వం తాజాగా రూ. 100 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను అర్హులైన SC, ST, BC, మైనారిటీ విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
Fee Reimbursement | హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో..
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపుపై ఇటీవల హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బకాయిలను ఆగస్ట్ 15 నాటికి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో, స్పందించిన ప్రభుత్వం ఈ మేరకు నిధులను విడుదల చేసింది. కోర్టు గడువు లోపే బాధ్యతలను పూర్తి చేసే దిశగా ప్రభుత్వం తొలి విడతగా ఈ వంద కోట్ల రూపాయలను కేటాయించింది.
Fee Reimbursement | రేపటి నుంచే జమ..

ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధులు సోమవారం (జూన్ 29) నుంచి నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను దశలవారీగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యతో వేల మంది విద్యార్థులకు ఉపశమనం లభించనుంది.
ఇది కూడా చదవండి..: Telangana University | విద్యార్థులతో తెయూ చెలగాటం.. ఒకే రోజు నెట్–బీఈడీ పరీక్షలతో గందరగోళం..