అక్షరటుడే, వెబ్డెస్క్: Rahul Gandhi Posters | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. రాహుల్ గాంధీ ప్రస్తుతం అందుబాటులో లేరని, ఆయన ‘కనిపించకుండా పోయారు’ అని పేర్కొంటూ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. ఈ పరిణామం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Rahul Gandhi Posters | షెహజాద్ పూనావాలా ఘాటు విమర్శలు..
ఈ పోస్టర్లపై స్పందించిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా, రాహుల్ గాంధీ (Rahul Gandhi) ని ‘గుమ్‌షుడా’ (అదృశ్యమైన) నేతగా , ‘పర్యాటన్’ (పర్యాటక) నాయకుడిగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ‘X’లో వరుస పోస్ట్‌లు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరును, రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలను పోలుస్తూ ఆయన విమర్శలు సంధించారు.
Rahul Gandhi Posters | సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా..
ప్రధాని మోదీ (PM Modi) సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా ఉన్నారని పూనావాలా పేర్కొన్నారు. “ఒకవైపు దేశం కోసం ఎప్పుడూ పని చేసే ప్రధాని మోదీ, మరోవైపు ప్రతి సంవత్సరం విహారయాత్రల కోసం కోట్లు ఖర్చు చేసే రాహుల్ గాంధీ.. ఎవరికి ప్రాధాన్యత ఉందో ప్రజలే ఆలోచించాలి” అని ఆయన అన్నారు.
Rahul Gandhi Posters | గైర్హాజరుపై ప్రశ్నలు..

రాహుల్ గాంధీ రాజకీయంగా, పార్లమెంటరీ కార్యక్రమాల్లో కీలక సమయాల్లో గైర్హాజరవుతున్నారని పూనావాలా ఆరోపించారు. పార్టీకి, పార్లమెంటుకు తన అవసరం ఉన్నప్పుడల్లా ఆయన విదేశీ పర్యటనలకు వెళ్తారని, ఆయనకు ప్రజల కంటే పర్యాటకమే ముఖ్యమని విమర్శించారు. అంతేకాకుండా, ఈ విదేశీ పర్యటనల కోసం రాహుల్ ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయల నిధుల మూలాలపై కూడా ఆయన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై బీజేపీ చేస్తున్న ఈ వ్యాఖ్యలు, విమర్శలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వేడిని పెంచాయి.
ఇది కూడా చదవండి..: Bhagirath Choudhary Subsidy | కేంద్ర మంత్రి భారీ అవినీతి.. సొంత శాఖలోనే రూ. 99 లక్షల సబ్సిడీల పంట.. నైతికతకు చరమగీతమా?