అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Chhatron Ki Goonj | యువత భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని డీసీసీ కార్పొరేషన్(DCC Nizamabad City) అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ మండిపడ్డారు. ఏఐసీసీ ఆదేశాల ప్రకారం ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమాన్ని నగరంలోని కాకతీయ కళాశాలలో (kakatiya College) ఆదివారం నిర్వహించారు.
Chhatron Ki Goonj | దేశంలో అయోమయంలో విద్యార్థులు..
ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దేశంలో విద్యార్థులు, యువత భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం జరుగుతున్న పేపర్ లీకేజీలతో విద్యార్థులను, నిరుద్యోగులను కేంద్ర సర్కార్ తీవ్రంగా మోసం చేస్తోందని మండిపడ్డారు. ‘ఇది కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాదు.. దేశ యువత భవిష్యత్తు కోసం ప్రారంభమైన ఒక జాతీయ ఉద్యమం’ అని చెప్పారు.
Chhatron Ki Goonj | విద్యార్థులకు అండగా రాహుల్ గాంధీ..
విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలే ప్రధాన ఎజెండాగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దేశవ్యాప్తంగా పోరాటానికి శ్రీకారం చుట్టారని రామకృష్ణ పేర్కొన్నారు. యువత సమస్యలు, సూచనలు, అనుభవాలను నేరుగా తెలుసుకునేందుకు రాహుల్ నేరుగా వారిని కలుస్తున్నారన్నారు. దేశంలో విద్యా సంస్కరణలు రావాలంటే విద్యార్థుల పోరాటం ఎంతో అవసరమని ఆయన తెలియజేశారు. యువత కలలను సాకారం చేస్తేనే భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతుందని కాంగ్రెస్ పార్టీ బలంగా విశ్వసిస్తుందన్నారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే వరకు.. యువతకు సరైన ఉపాధి అవకావాలు లభించే వరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని.. ఈ పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలని ఆయన పిలుపునిచ్చారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నుడా (NUDA) ఛైర్మన్ కేశ వేణు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, సీనియర్ నాయకులు జావీద్ అక్రమ్, ప్రీతం, ముస్తఫా, గోవర్దన్, వహీద్ తదితరులు పాల్గొన్నారు.
