అక్షరటుడే, గాంధారి: Kasturba Negligence | తల్లిదండ్రులు ఎంతో భరోసాతో తమ పిల్లలను కస్తుర్బాలో చేర్పిస్తున్నారు.. కానీ అక్కడి సిబ్బంది బాలికల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి (gandhari) మండల కేంద్రంలోని కస్తుర్బాలో విద్యార్థినుల పట్ల అక్కడి సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది.
Kasturba Negligence | మండల కేంద్రంలోని కస్తుర్బా గాంధీ పాఠశాలలో..
గాంధారి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో (Kasturba Gandhi School) కొందరు విద్యార్థినులు ఆదివారం కడుపులో, ఛాతిలో నొప్పి వస్తుందని అక్కడి ఇన్ఛార్జికి చెప్పారు.
అయితే, సదరు ఇన్ఛార్జి మాత్రం ‘నీళ్లు తాగి పడుకోండి.. తగ్గిపోతుంది’ అంటూ నిర్లక్ష్యంగా సమధానం ఇచ్చారని విద్యార్థినులు వెక్కివెక్కి ఏడ్చారు. అంతేకాకుండా కస్తుర్బాలో కనీసం తాగడానికి నీరు కూడా లేవని.. బాత్రూం సౌకర్యం కూడా సరిగ్గా లేదన్నారు. తమ దుస్థితిని ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని వారు రోధించారు.
మారుమూల ప్రాంతాల నుంచి ఉన్నత మంచి విద్యను అభ్యసించాలని ఇక్కడికి వస్తే మమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతున్నారని వారు వాపోయారు. అనంతరం వారు తమ తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. ఆరోగ్యపరంగా నైనా అక్కడి ఇన్ఛార్జి సరైన రీతిలో స్పందించాల్సి ఉందని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: టాలీవుడ్లో జూన్ 29 అరుదైన రోజు.