Armoor High Tension | ఆర్మూర్​లో హైటెన్షన్​.. ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

ఆర్మూర్ పట్టణంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసనకు పిలుపునివ్వడంతో భారీగా పోలీసులు మోహరించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, ఆర్మూర్ : Armoor High Tension | ఆర్మూర్ పట్టణంలో సోమవారం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు రోజుల క్రితం పట్టణంలోని భరత్ చంద్ర పాఠశాలలో హిందూ విద్యార్థులకు ఉర్దూ, నమాజ్ నేర్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బీజేపీ నాయకులు పాఠశాలలో ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే.ఎంఐఎం ఆధ్వర్యంలో పలువురు ఆదివారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్​కు చేరుకొని బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన నిర్వహించారు.

ఈ క్రమంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం భారీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. దీంతో పట్టణంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళన కార్యక్రమాల నేపథ్యంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్​హెచ్​వో సత్య నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

 Armoor High Tension | పోలీసులతో ఎమ్మెల్యే వాగ్వాదం

ఆర్మూర్​లో (Armoor High Tension ) చేపడుతున్న హిందూ సంఘాల ర్యాలీకి మద్దతుగా హైదరాబాద్​ నుంచి ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి (MLA Rakesh Reddy) బయలు దేరారు. భిక్కనూరు టోల్​గేట్ వద్ద ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పోలీసులతో వాగ్వాదం చేశారు. తను ఆర్మూర్ వెళ్లి తీరాల్సిందేనని లేనిపక్షంలో ఇక్కడే రోడ్డుపై కూర్చుంటానని పేర్కొన్నారు. ఆర్మూర్​ భరత్ చంద్ర పాఠశాలలో హిందు విద్యార్థులకు తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఉర్దూ, నమాజ్ నేర్పడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మసీదులకు, మదర్సాలకు వెళ్లి భవద్గీత, గాయత్రి మంత్రాలు నేర్పడం లేదని, మరి వారు ఇలాంటి చర్యలకు దిగడం ఎంతవరకు సమంజసమన్నారు. అప్పుగా ఇచ్చిన డబ్బులు అడిగితే ఆర్మూరు మండలంలో పిప్రి గ్రామంలో ఇల్లు తగలపెట్టడంపై మండిపడ్డడారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని, అలాంటి వారికి పోలీసులు బాసటగా నిలవొద్దని ఆయన సూచించారు.

ఇది కూడా చదవండి..: Kasturba Negligence | కస్తుర్బాలో విద్యార్థినులు ఆర్తనాదాలు.. ఇన్​ఛార్జి నిర్లక్ష్యంపై వెల్లువెత్తుతున్న నిరసనలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *