Banswada Police | బాన్సువాడలో దారుణం.. నవజాత శిశువు లభ్యం..

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Banswada Police | బాన్సువాడలో (Banswada) దారుణం చోటు చేసుకుంది. పట్టణంలో ఇళ్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు నవజాత శిశువును వదిలి వెళ్లారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.

Banswada Police | పట్టణంలోని మదీనా కాలనీలో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ పట్టణంలోని మదీనా కాలనీలో ఇళ్ల మధ్య ఖాళీ స్థలంలో శిశువు కనిపించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియని వ్యక్తులు నిర్దయగా చెట్ల మధ్య వదిలి వెళ్లినట్లు కాలనీవాసులు తెలిపారు. శిశువు ఏడుపు వినిపించడంతో అక్కడికి వెళ్లిన మహిళలు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని శిశువును రక్షించారు.

Banswada Police | అప్పటివరకు స్థానికుల సంరక్షణలో..

అనంతరం శిశువును బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి (Banswada Government Hospital) తరలించి వైద్య చికిత్స అందించేలా చర్యలు చేపట్టారు. పోలీసులు వచ్చే వరకు స్థానిక ప్రజలు శిశువుకు తాత్కాలిక రక్షణ కల్పించడం గమనార్హం. వారి సమయోచిత స్పందనతో శిశువు ప్రాణాపాయం తప్పిందని, ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శిశువును వదిలి వెళ్లిన వారెవరు.. ఎలాంటి పరిస్థితుల్లో ఈ చర్యకు పాల్పడ్డారనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి : Vasavi Matha Jayanthi | రాష్ట్ర పండుగగా వాసవీ మాత జయంతి!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *