అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nitin Nabin | యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అన్నారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఘట్కేసర్ వీబీఐటీ కాలేజీలో జరిగిన ‘వికసిత్ భారత్ స్టూడెంట్ కాన్క్లేవ్’లో ఆయన పాల్గొన్నారు.
కాన్క్లేవ్లో డ్రగ్స్‌పై ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు నితిన్ నబిన్ స్పందించారు. డ్రగ్స్ దూరంగా ఉండాలని యువతకు ఆయన సూచించారు. జీవితంతో ఆటలు ఆడొద్దన్నారు. తాము డ్రగ్స్ విషయంలో ఉపేక్షించమని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఒకసారి డ్రగ్స్‌కు అలవాటు పడితే, జీవితం నాశనం అవుతుందన్నారు. తల్లిదండ్రుల పేరు చెడగొట్టద్దని కోరారు. తల్లిదండ్రులపై ప్రేమ ఉన్న వారు డ్రగ్స్‌కు నో చెప్పాలన్నారు.
Nitin Nabin | ప్రజల్లో చైతన్యం..
నితిన్ నబిన్ మాట్లాడుతూ. 1980 నుండి 2000 ప్రారంభం వరకు ఉన్న కాలంలో, ప్రజలకు, నాటి తరానికి తమ హక్కుల పట్ల పెద్దగా అవగాహన ఉండేది కాదన్నారు. కంప్యూటర్లు, ఇంటర్నెట్ రాకతో, ప్రతి వ్యక్తి తమ హక్కుల గురించి అవగాహనను పొందారని చెప్పారు. ఇంటర్నెట్ ప్రజల్లో చైతన్యాన్ని ఖచ్చితంగా పెంచిందని తెలిపారు. దీని ఫలితంగా ప్రజాప్రతినిధులు చేసే వ్యాఖ్యలను ప్రజలు సులభంగా మర్చిపోయే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. ప్రజలు వాటిని గుర్తుంచుకుంటారు, సరైన సమయంలో తగిన సమాధానం ఇస్తారన్నారు.
Nitin Nabin | పరుగు పందెం కాదు

జీవితం పరుగుపందెం కాదని నితిన్ నబిన్ అన్నారు. మన ఓపికకు పరీక్ష అని పేర్కొన్నారు. తాను చిన్న వయసులో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. అయితే తనకు ఏ పని అప్పగించిన నిబద్ధతతో పూర్తి చేశానని తెలిపారు. ప్రస్తుత యువత వేగంగా లక్ష్యాలు చేరుకోవాలనుకుంటున్నారని ఆయన అన్నారు. అయితే ఓపిక, నిలకడ అవసరం అని యువతకు సూచించారు.
ఇది కూడా చదవండి..: Ayodhya Donation Case | అయోధ్య విరాళాల కేసు.. అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీం